తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ నుంచి 'గోపాల గోపాల' సాంగ్ రిలీజ్

తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ నుంచి 'గోపాల గోపాల' సాంగ్ రిలీజ్
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి 'గోపాల గోపాల..' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించగా, వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు, మేఘన నాయుడు పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - ' గోకుల గోపాలక, మాధవ నారాయణ, కానగా సాధ్యమా, కలియుగ మాయ, గోకుల గోపాలక, మాధవ నారాయణ, కాలమే సాక్షిగా అలమిన మాయ, నీదు మాయే నీల వర్ణా , హాసమైనా శోకమైనా కాంతులే నిలుపవా కనుతడిన..' అంటూ కలియుగంలో జరుగుతున్న వింత ఘటనల్ని ఆ గోవిందుడికి విన్నవిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట 
 
Thimmarajupalli TV
Gopala Gopala song
Kiran Abbavaram

Watch Today's Deals on Amazon

More Press News