"తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో వెంకటేష్‌

Entertainment
Advertisement
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ - అంతరించిపోయిన వస్తువులను మ్యూజియంలో పెడుతుంటారు. అలాంటి మ్యూజియం మీరు తెరపై చూడాలంటే మా సినిమాను ఈనెల 17న చూడండి. ఎందుకంటే మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. అందులో అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్ ను చూస్తారు. ఇది తిమ్మరాజుపల్లి స్టోరీ మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల వారి స్టోరీ. మొత్తం ఏపీ, తెలంగాణలో 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లు దాదాపు 5 కోట్ల మంది ఉంటారు. వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే వారి ఫ్యామిలీతో కలిసి చూస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ - మా మూవీ నుంచి రిలీజ్ చేసిన మూడు సాంగ్స్ మీకు నచ్చాయి. ట్రైలర్ లో మీరు చూసిన కంటెంట్ ను మించి సినిమాలో చూస్తారు. ఈ ఫ్యూరిటీ, ఎమోషన్స్ సినిమాలో ఇంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఫుల్ గా కనిపిస్తాయి. 35 రోజులు ఈ సినిమా కోసం షూటింగ్ చేశాం. చాలా మెమొరీస్ ఉన్నాయి. అవన్నీ ప్రీ రిలీజ్ లో చెబుతాను. మేమంతా డెడికేషన్ తో , సినిమా మీద ప్రేమతో, కిరణ్ గారు మా మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టాలని కష్టపడ్డాం. ఈ నెల 17న మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ తో మా సినిమా చూసేందుకు వెళ్లండి. అన్నారు. 

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ - మన లైఫ్ లో మొదటిసారి ఎక్సిపీరియన్స్ చేసేవన్నీ ఒక మంచి ఫీల్ ను ఇస్తాయి. మొదటిసారి తిన్న అమ్మచేతి ముద్ద ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా మన లైఫ్ లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో అవకాశం కల్పించిన కిరణ్ అన్నకు థ్యాంక్స్. ఈ నెల 17న థియేటర్స్ లోకి మా మూవీ రాబోతోంది. తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్ లో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు నాకు బాగా ఇష్టం. అందుకే ఈ రోజు చెన్నకేశవరెడ్డి గెటప్ లో వచ్చాను. బాలకృష్ణ గారికి థ్యాంక్స్. అలాగే వింటేజ్ హీరోలందరికీ థ్యాంక్స్. మా చిత్రంలో పనిచేసిన వాళ్లందరి కల సినిమా. ఆ కల తీరేందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ పట్టింది. వాళ్లు మా మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. ఇంత ప్యాషనేట్ టీమ్ చేసిన సినిమాను నేను హీరోగా చేసిన సినిమాలాగే ప్రమోట్ చేస్తున్నా. మేము కష్టపడ్డామని సినిమా చూడమని చెప్పను. నేను ప్రేక్షకుల టైమ్, డబ్బుకు విలువఇస్తాను. మా మూవీ ట్రైలర్, సాంగ్స్ , కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే థియేటర్స్ కు వెళ్లి మా టీమ్ అందరినీ సపోర్ట్ చేయండి. 


Advertisement
Thimmarajupalli TVThimmarajupalli TV trailerVenkatesh DaggubatiKiran Abbavaram

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News