రోజా, సుధీర్ అతిథులుగా జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఆడిషన్స్ ఏప్రిల్ 12న, మన హైదరాబాద్లో!

Entertainment
Advertisement
హైదరాబాద్, 09 ఏప్రిల్ 2026: ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుండే ఛానల్ జీ తెలుగు. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి బుల్లితెరపై మెరిసే అవకాశం కల్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న సక్సెస్ఫుల్ షో డ్రామా జూనియర్స్  సరికొత్త సీజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లోని నటనా ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 9 ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్‌లను పూర్తి చేసుకున్న డ్రామా జూనియర్స్ మరో సీజన్తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రతిభగల పిల్లలని ఆడిషన్స్కి ఆహ్వానిస్తోంది. - డ్రామా జూనియర్స్ సీజన్‌ 9 కోసం తెలుగు రాష్ట్రాల్లో నటనపై ఆసక్తిగల చిన్నారులకు అద్భుత అవకాశం అందిస్తోంది.
4 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని అవకాశం అందిస్తోంది జీ తెలుగు. మీ పిల్లలకు నటనపై ఆసక్తి ఉంటే తప్పకుండా ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బాటలు వేయండి. విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్ వేదికగా తమ నటనతో అలరించే పిల్లలకోసం ఆన్గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించనుంది. నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, మార్షల్ ఆర్ట్స్, మ్యాజిక్ లో ప్రవేశం ఉన్న పిల్లలకూ అద్భుత అవకాశం అందిస్తోంది. ఈ ఆడిషన్స్ ఆదివారం( ఏప్రిల్ 12న) రోజు, సారథి స్టూడియోస్, అమీర్పేట్, హైదరాబాద్ నందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించబడతాయి. ఈ ఆడిషన్స్లో ప్రముఖ నటి రోజా, యాంకర్ సుధీర్ కూడా హాజరై పిల్లలను ప్రోత్సహించనున్నారు. 
మీ పిల్లల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ఈ ఆదివారం, ఏప్రిల్ 12న హైదరాబాద్ వచ్చేస్తోంది మీ జీ తెలుగు!
Advertisement
RojaSudhirDrama JuniorsZee Telugu

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News