డెకాయిట్' కోసం మహేష్‌బాబును రిఫరెన్స్‌గా తీసుకున్నాం: అడివి శేష్‌

డెకాయిట్' కోసం మహేష్‌బాబును రిఫరెన్స్‌గా తీసుకున్నాం: అడివి శేష్‌
అడివి శేష్ తన పాన్ ఇండియా చిత్రం 'డెకాయిట్”తో మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే, ఇది మరో ఇంటెన్స్, ఎమోషన్స్ కూడిన కథగా కనిపిస్తోంది. 

“డెకాయిట్” కథ హరి, జూలియెట్ మధ్య ఉన్న ఇంటెన్స్ బాండింగ్ చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రశాంతమైన జీవితానికి కలలు కంటున్న ఈ జంట జీవితాన్ని, ఒక ద్రోహం పూర్తిగా మార్చేస్తుంది. హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కానీ అతని పరారితో కథ మళ్లీ మలుపు తిరుగుతుంది. ఈ సమయంలో జూలియెట్ తన అనారోగ్యంతో ఉన్న కుమార్తె ప్రాణాలను కాపాడటానికి పెద్ద మొత్తంలో డబ్బు కోసం పోరాడుతుంది. ఈ పరిస్థితుల్లో, హరి ప్రేమికుడి నుంచి సర్వైవర్‌గా మారి, జూలియెట్ అవసరాన్ని ఉపయోగించుకుంటూ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు.

దర్శకుడు షనిల్ డియో కథను చెప్పిన విధానం ప్రత్యేకంగా నిలుస్తుంది. గత జ్ఞాపకాలు, ప్రస్తుత సంఘటనలను కలిపి చూపించే తీరు ట్రైలర్‌లో ఆకట్టుకుంది. అడివి శేష్  కథా రచనలో కూడా భాగం కావడం వల్ల, ప్రేమ, ద్రోహం, సర్వైవల్ మధ్య జరిగే భావోద్వేగాల ఊగిసలాట చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది.

మృణాల్ జూలియెట్ పాత్రలో ప్రేమికురాలిగా, తల్లిగా రెండింటినీ అద్భుతంగా నటించారు. అనురాగ్ కశ్యప్  కూల్, టెర్రిఫిక్ పోలీస్ పాత్రలో కనిపిస్తూ కథకు మరింత టెన్షన్ తీసుకువచ్చారు. ప్రకాష్ రాజ్ తన అనుభవంతో కథకు బలాన్ని ఇచ్చారు. అలాగే సునీల్, అతుల్ కులకర్ణి వంటి నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో 
హీరో అడివి శేష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని మంచి సినిమాలు చేశామనేదే నా లైఫ్ ఫిలాసఫీ. డెకాయిట్ ప్రాణం పెట్టి చేసిన సినిమా. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కానీ ట్రైలర్‌లో వాటిని బయటపెట్టలేదు. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడనే అంశమే ఈ కథలో ప్రధానంగా ఉంటుంది. ఫీలింగ్స్‌పై ఒక మంచి కథ చెప్పాలని ప్రయత్నించాం. ఈ సినిమా కథ లేయర్స్‌గా ఓపెన్ అవుతుంది. ఇది పూర్తిగా ఫీలింగ్స్ ఆధారంగా నడిచే సినిమా.  మహేష్ బాబు గారితో నాకు పర్సనల్ కనెక్షన్ ఉంది. హరి క్యారెక్టర్ ఎమోషన్ క్యాప్చర్ చేయడానికి ఆయనను రిఫరెన్స్‌గా తీసుకున్నాను అన్నారు. 

మృణాల్ ఠాకూర్  మాట్లాడుతూ…సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. డెకాయిట్లో నేను చేసిన సరస్వతి పాత్ర నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. సుప్రియ, శేష్ గారు, శానిల్ ఈ సినిమాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లా నిలబడ్డారు. నేను 100% ఎఫర్ట్ పెట్టాను. ఈ సినిమా తప్పకుండా మీ అంచనాలను అందుకుంటుంది.అన్నారు. 

అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ…ఈ సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్‌లో నేను ఇంతవరకు కనిపించలేదు. సుప్రియ గారితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆమె ఒక డైనమిక్ ప్రొడ్యూసర్.  ప్రతి ఛాలెంజ్‌ని స్వీకరిస్తారు.


Dacoit
Adivi Sesh
SupriyaYarlagadda
Tollywood

Watch Today's Deals on Amazon

More Press News