Allu arjun: హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా..
Add ap7am to your home Screen

హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ ఇనిషేటివ్ తీసుకుంది. హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు.

9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. కేంద్రప్రభుత్వం స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా హెచ్ పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈనెల 8వ తేదీన  అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమానికి ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం అభినందనీయం
Allu arjun
HPV vaccination drive
AAFA
Allu Arjun Fans Association

Watch Today's Deals on Amazon

More Press News