యూత్ మూవీని థియేటర్స్ లో చూసి అందరూ ఎంజాయ్ చేయాలి: శ్రీ విష్ణు

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ "యూత్". ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న "యూత్" మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో "యూత్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోలు శ్రీ విష్ణు, సత్యదేవ్, డైరెక్టర్స్ సాయి రాజేశ్, వశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ - టాలీవుడ్ లో ఎంతోమంది మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ వేదిక మీద నిలబడ్డాం. యూత్ సినిమా ఆల్రెడీ తమిళంలో పెద్ద సక్సెస్ సాధించింది. 4 రోజుల్లో 30 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకుంది. బుక్ మై షో లో టికెట్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. తెలుగులో కూడా అలాంటి సక్సెస్ దక్కుతుందనే ఆశిస్తున్నాం. దీన్ని ఒక తెలుగు స్ట్రైట్ సినిమాలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. వినీత్ ఈ వర్క్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఇంజినీరింగ్ టు సినిమా అని ఈ2సీ బ్యానర్ పేరు ఎప్పుడు పెట్టుకున్నామో గానీ మాకు పరీక్షలు రాసినట్లే ఉంది. మంచి మార్కులతో ఈ నెల 26న పాస్ అవుతామని నమ్ముతున్నాం. యూత్, లవర్స్ మాత్రమే కాదు పేరెంట్స్ తో కూడా కలిసి చూడాల్సిన చిత్రమిది. అన్నారు.

ప్రొడ్యూసర్ వినీత్ మాట్లాడుతూ - యూత్ సినిమాను ఒక్కరే చూస్తే బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఇంకా బాగుంటుంది, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో థియేటర్స్ కు వెళ్తే మరింత ఎంజాయ్ చేస్తారు. అందుకే మేము ప్రమోషన్స్ లో మీ గ్యాంగ్ తో సినిమాకు వెళ్లండని చెబుతున్నాం. గ్యాంగ్ అంటే ఏజ్ లిమిట్ ఏదీ లేదు. ఎవరైనా కలిసి వెళ్లొచ్చు. తమిళంలో అలాగే గ్యాంగ్స్ గ్యాంగ్స్ గా వెళ్లి సినిమాను చూస్తున్నారు. ఈ నెల 26న తెలుగులోనూ అలాగే థియేటర్స్ కు వెళ్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుతూ -  ఉగాదికి తమిళంలో రిలీజైన యూత్ సినిమా మంచి విజయం సాధించింది.  శ్రీరామనవమికి తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆ సక్సెస్ ను రిపీట్ చేయబోతోంది. ఫ్రెండ్స్ తో పాటు పేరెంట్స్, ఫ్యామిలీతో కూడా మా మూవీని చూడండి. అన్నారు.

డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ - యూత్ మూవీకి కెన్ అండ్ గ్యాంగ్ అని క్రెడిట్ ఇవ్వడం బాగుంది. తమిళంలో ఈ మూవీ హిట్ అయ్యింది. ఏ భాషలో మంచి కంటెంట్ ఉన్నా మన తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. సందీప్, వినీత్ ఒక హిట్ మూవీని తీసుకుని బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. అన్నారు.

ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ - సందీప్, వినీత్ ఈ సినిమా తీసుకున్నారని తెలిసి, అన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటన్నారని కనుక్కున్నా. వాళ్లకు సాయి రాజేశ్, శ్రీ విష్ణు, వశిష్ట ..ఇలా అందరూ సపోర్ట్ గా నిలిచారు. చాలా కష్టపడి ఈ సినిమాను పర్పెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు సందీప్, వినీత్. కెన్ అండ్ గ్యాంగ్ అని పెట్టుకోవడంలో ఒక టీమ్ స్పిరిట్ ఉంది. అన్నారు.

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ - మా బేబి మూవీని ఆడియెన్స్ దగ్గరకు తీసుకెళ్లడంలో సందీప్, వినీత్ కీలక పాత్ర పోషించారు. రాత్రీ పగలు మాతో కూర్చుని డిస్కషన్స్ చేస్తుండేవారు. వాళ్లు ఫస్ట్ టైమ్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే నాకు ఫస్ట్ భయమేసింది. కానీ తమిళంలో వస్తున్న హిట్ టాక్, కలెక్షన్స్ చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఈ సినిమాను హిట్ చేస్తారు. ఇందాక వశిష్ట అన్నట్లు కనెక్ట్ అయితే ఇది మరో లిటిల్ హార్ట్స్ అవుతుంది. ధనుష్, ప్రదీప్ రంగనాథన్ ను ఆదరించినట్లే కెన్ ను కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరో, డైరెక్టర్ కెన్ మాట్లాడుతూ - నేను సార్ మూవీలో ఒక చిన్న రోల్ చేశాను. హీరోగా, దర్శకుడిగా యూత్ నా ఫస్ట్ మూవీ. కొత్త వాళ్లం కదా ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాం. కానీ తమిళంలో మంచి విజయాన్ని అందించారు. తెలుగు ఆడియెన్స్ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటారని సార్ మూవీ టైమ్ లో చూశాను. వాళ్లకు భాషతో పనిలేదు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తప్పకుండా ఆదరిస్తారు. ఇటీవల కార్తీ, సూర్య గారిని కలిశాను. తెలుగులో మూవీ రిలీజ్ చేస్తున్నామని వారితో చెబితే, తమిళంలో ఎలాంటి సక్సెస్ వచ్చిందో, తెలుగులోనూ సేమ్ సక్సెస్ అందుకుంటావని చెప్పారు. తెలుగు ఆడియెన్స్ సినిమాను ఎంత లవ్ చేస్తారో సూర్య, కార్తీ గారు చెప్పారు. రఘువరన్ బీటెక్ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రతి ఆడియెన్ మా మూవీని కూడా ఎంజాయ్ చేస్తారు. సూర్య, కార్తీ, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ లా మా టీమ్ ను కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - నా సింగిల్ మూవీ సినిమాకు తమిళ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఆ సినిమా షూటింగ్ చేస్తున్న టైమ్ లో కెన్ ను చూశాను. చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఇప్పుడు హీరోగా మారి యూత్ తో మన ముందుకు వస్తున్నాడు. తమిళంలో యూత్ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్. తెలుగులో కూడా మీకు అలాంటి సక్సెస్ రావాలి. సందీప్, వినీత్ వల్లే నేను నా మూవీస్ కు డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేసుకోగలిగాను. ఇంజినీరింగ్ నుంచి సినిమాకు వచ్చిన యూత్ వీళ్లిద్దరు. ఈ సినిమాకు చాలా క్వాలిటీగా తెలుగు డబ్బింగ్ కోసం స్క్రిప్ట్ చేయించుకున్నారు, అలాగే డబ్బింగ్, సాంగ్స్ క్వాలిటీగా చేసుకున్నారు. నెల రోజుల్లోపే ప్రమోషన్స్ సహా అన్ని వర్క్స్ పూర్తి చేసి సినిమాను రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి చూడండి. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఈ నెల 26న యూత్ మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు. 




More Press Releases