భర్త మహాశయులకు విజ్ఞప్తి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఈ ఆదివారం, మీ జీ తెలుగులో!

వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాను అందించేందుకు సిద్ధమైంది. కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై  చెరుకూరి సుధాకర్ నిర్మించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’  సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అందిస్తోంది. మాస్ మహారాజ రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి నటించిన బ్లాక్బస్టర్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!

రామ్ (రవితేజ) వైన్ కంపెనీ ఓనర్. తన భార్య బాలామణి (డింపుల్ హయాతి) తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. రామ్ కంపెనీ పని మీద స్పెయిన్ వెళ‌తాడు. అక్కడ రామ్ కి మానస శెట్టి (ఆషికా రంగనాథ్) పరిచయం అవుతుంది. రామ్, మానస దగ్గర సత్యగా పరిచయం అవుతాడు. ఇద్దరూ ఒక్కటవుతారు. అనుకోకుండా జరిగిన ఆ తప్పు రామ్ అలియాస్ సత్య లైఫ్ ను ఎలా మార్చింది? రామ్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? మానస విషయం బాలామణికి తెలిసిందా? చివరకు రామ్ ఇద్దర్ని ఎలా హ్యాండిల్ చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ ఆదివారం జీ తెలుగు వేదికగా ప్రసారం కానున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా మిస్ కాకుండా చూడాల్సిందే!

కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటించగా, సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆసక్తికరమైన కథాంశం, ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మెప్పించిన ఈ  సినిమాని మీరూ తప్పకుండా చూసేయండి!


More Press Releases