రోజా, శేఖర్ మాస్టర్ & టాప్ సెలబ్రిటీలు సందడి చేసిన జీ తెలుగు ఉగాది స్పెషల్‌ ఈవెంట్.. ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం!

హైదరాబాద్, 17 మార్చి 2026: ఆకట్టుకునే సీరియల్స్అలరించే రియాల్టీ షోలతో అలరిస్తున్న జీ తెలుగు ఈ ఉగాదికి ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకు మరో ప్రత్యేక కార్యక్రమంతో వచ్చేస్తోంది. పండుగలుప్రత్యేక సందర్భాలను వినోదభరిత కార్యక్రమాలతో ప్రత్యేకంగా మారుస్తున్న జీ తెలుగు ఈ తెలుగు నూతన సంవత్సరాది ఉగాదికి మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. సంస్కృతిసంప్రదాయం మేళవించిన ఘనమైన వేడుక.. వెండితెరబుల్లితెర తారల సందడితో సరదాగా సాగిన సంబరం ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం.. మార్చి 19, గురువారం ఉదయం 10 గంటలకుమీ జీ తెలుగులో!

నూతన సంవత్సరాది ఉగాది పండగని జీ తెలుగు నటీనటులందరూ ఘనంగా జరుపుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్ రవి వ్యాఖ్యాతగా నిర్వహించనున్నారు. వెండితెర, బుల్లితెర తారలతో ఘనంగా సాగనున్న ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ పాల్గొని సందడి చేయనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హీరోయిన్ యంగ్ బ్యూటీ శ్రీలీల గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి..’ స్టెప్తో అందరినీ అలరించనుంది. అంతేకాదు, స్వయంభూ సినిమా టీమ్ నుండి హీరో నిఖిల్, సంయుక్ మీనన్, నభా నటేష్ కూడా సందడి చేశారు. 

అద్భుతమైన ప్రదర్శనలు, సరదా సంభాషణలతో సాగనున్న ఈ కార్యక్రమంలో ఉగాది పచ్చడి చేయడంతో పాటు, ‘ఎవరి గొంతు బలమైనదో’ తేల్చుకునేందుకు ప్రముఖ నటి రోజా, డాన్స్ మాస్టర్ శేఖర్ ఇద్దరూ రెండు టీమ్లుగా పోటీ పడనున్నారు. ఈ పోటీలో అమ్మాయిలు రోజాని, అబ్బాయిలు శేఖర్ మాస్టర్ని సపోర్ట్ చేయనున్నారు. ఉగాది సందర్భంగా సీరియల్ డబ్బింగ్ ఆర్టిస్టులకు వారు వాయిస్ ఇచ్చే నటీనటుల చేతుల మీదుగా సన్మానం జరగనుంది. ఆటలు, పాటలు, అల్లరి, అద్భుత ప్రదర్శనలు, సరదా సంబరాలతో సాగిన ఈ ఉగాది ప్రత్యేక కార్యక్రమం ఉగాదికి వస్తున్నాం సరదా తెస్తున్నాంని జీ తెలుగు వేదికగా మీరూ తప్పక చూడండి!

తెలుగు నూతన సంవత్సర కానుక ‘ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం’.. ఈ గురువారం ఉదయం 10 గంటలకు, మీ జీ తెలుగులో..డోంట్ మిస్!

 


More Press Releases