‘బ్యాండ్ మేళం’ విజయం సాధించాలి: శివాజీ
కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాని మార్చి 13న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి తమన్, శివాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
*శివాజీ మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ మంచి లవ్ స్టోరితో తెరకెక్కింది. ఇందులో కూడా నన్ను ఓ పాత్ర చేయమని అడిగారు. కానీ రొటీన్ అవుతుందని వద్దని చెప్పాను. శ్రీదేవీ చాలా మంచి నటి. రోషన్ మంచి టాలెంట్ ఉన్న యాక్టర్. భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్తాడు. ‘బ్యాండ్ మేళం’తో వీరంతా మరోస్థాయికి వెళ్లబోతోన్నారు. ‘కోర్ట్’ మార్చి 13న ప్రీమియర్ వేసి హిట్టు కొట్టాం. ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ మార్చి 13న రాబోతోంది. ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*తమన్ మాట్లాడుతూ* .. ‘కోన గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ‘దూకుడు’తో నా కెరీర్ ఇంకా కొనసాగుతూనే వెళ్తోంది. కోన గారి చేతికి గోల్డ్ ఉండటం కాదు.. ఆయన హ్యాండే.. గోల్డెన్ హ్యాండ్. ‘బ్యాండ్ మేళం’ కోసం నేను ఈ రోజు ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. హర్ష్ రోషన్, శ్రీదేవీలను చూస్తుంటే నాకు ‘నువ్వే కావాలి’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. నాకు విజయ్ బుల్గానిన్ పాటలంటే చాలా ఇష్టం. మార్చి 13న ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
*కోన వెంకట్ మాట్లాడుతూ* .. ‘గుండెలోంచి వచ్చే ప్రేమ కథకు ఎలాంటి ఆదరణ దక్కుతుందని ‘నిన్ను కోరి’తో తెలిసింది. ఈ ‘నిన్ను కోరి’ వల్లే ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ నిర్మించాను. నాని ఫిల్మోగ్రఫీలో ‘నిన్ను కోరి’ ఓ మెమరబుల్ ఫిల్మ్‌గా నిలిచింది. శివ నిర్వాణ ఈ కథను గుండెతో చెప్పాడు. నాకు సతీష్ ఈ కథను చెప్పినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. ఈ కథలోని సంఘర్షణ చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అందరినీ కట్టి పడేస్తుంది. ఏజ్, యాక్టింగ్ సత్తా ఉండటం వల్లే రోషన్, శ్రీదేవీలను తీసుకున్నాం. సాయి కుమార్ ఈ కథను విని షాక్ అయ్యారు. విజయ్ బుల్గానిన్ మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మార్చి 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ సక్సెస్ చేసి ఇంకా కొత్త వారిని పరిచయం చేసే శక్తిని, సక్సెస్‌ను అందిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నందినీ రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ టీజర్ నచ్చింది. డైరెక్టర్ ఈ రోజు కాకుండా సినిమా రిలీజ్ రోజు, సక్సెస్ రోజు మాట్లాడతారని అనిపిస్తోంది. హర్ష్ రోషన్, శ్రీదేవీ ఆడియెన్స్‌తో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. కోన అన్నతో నాకు ఇరవై ఏళ్ల బంధం ఉంది. ఆయన సినిమాలు సక్సెస్ అవుతూ ఉండాలి. ఇలానే కొత్త వారిని ఇండస్ట్రీలోకి తీసుకు వస్తూ ఉండాలి. విజయ్ బుల్గానిన్ సంగీతమంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*శివ నిర్వాణ మాట్లాడుతూ* .. ‘కోన గారు నాకు గాడ్ ఫాదర్. కోన గారి వల్ల ఎంతో మంది దర్శకులు, రచయితలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ‘బ్యాండ్ మేళం’తోనూ కొత్త వారిని పరిచయం చేస్తున్నారు. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఇంకా ఇలాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. హర్ష్ రోషన్ ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయికి చేరుకుంటాడు. శ్రీదేవి అద్భుతమైన నటి. టీజర్‌ను చూస్తే గ్యాంగ్‌తో సినిమాకి వెళ్లాలని అనిపించింది. ఈ మూవీతో సతీష్‌కి హిట్ రావాలి. విజయ్ బుల్గానిన్ సంగీతమంటే నాకు చాలా ఇష్టం. ‘బ్యాండ్ మేళం’ మూవీకి మార్చి 13న విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*వేణు ఊడుగుల మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ టీజర్ నాకు చాలా నచ్చింది. కమర్షియల్ లెక్కలతో డబ్బుల కోసం తీసిన సినిమా కాదని నాకు అర్థమైంది. ప్రేమతో, ప్రాణం పెట్టి, తెలంగాణ మట్టి వాసనతో జీవితాన్ని చూపించే చిత్రమిది. ఈ కథ నేను ఆల్రెడీ విన్నాను. కథలోని ఇంటెన్స్, ఫిలాసఫికల్ బేస్‌ను టీజర్‌లో చక్కగా చూపించారు. ఇలాంటి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న కోన గారికి థాంక్స్. ఇది తెలంగాణ జీవితం ఉన్న తెలుగు సినిమా’ అని అన్నారు.
*హర్ష్ రోషన్ మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ. ప్రతీ ఎమోషన్‌ను పీక్‌లో చూపించే పాత్ర నాది. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. మా కోసం వచ్చిన శివాజీ గారికి, తమన్ గారికి థాంక్స్. మార్చి 13న ‘బ్యాండ్ మేళం’ రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
*శ్రీదేవి మాట్లాడుతూ* .. ‘‘కోర్ట్’తో మా అందరినీ ఎంతలా ఆదరించారో ‘బ్యాండ్ మేళం’ని కూడా అంతలానే ఆదరిస్తారని, ప్రేమ చూపిస్తారని కోరుకుంటున్నాను. మా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మా చిత్రం మార్చి 13న రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*సతీష్ జవ్వాజీ మాట్లాడుతూ* .. ‘‘బ్యాండ్ మేళం’ టీజర్ లాంచ్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ‘కోర్ట్’ తరువాత మళ్లీ ఇలాంటి మంచి కథతో రాబోతోండటం ఆనందంగా ఉంది. నాని అన్న గర్వ పడేలా నేను చిత్రాల్ని చేస్తుంటాను. మా మూవీ మార్చి 13న రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.