జీ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 'కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1' ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు!

Entertainment
Advertisement

హైదరాబాద్, 21 జనవరి 2026: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది జీ తెలుగు. రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ నటించిన బ్లాకబస్టర్ మూవీ కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1, ఈ శనివారం (జనవరి 24) సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో మాత్రమే!

కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే రాజు రాజ్యం ఉంటుంది. రాజశేఖర్ వంశం ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ల ఆధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బర్మ (రిషబ్ శెట్టి) ఉంటాడు. తన ప్రజల కోసం బర్మ ఏకంగా రాజ్యంలోకే వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బర్మ, కనకావతి (రుక్మిణి వసంత్)కి దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?, అసలు బర్మ ఎవరు ?, అతను ఎక్కడ నుంచి వచ్చాడు ? కనకవతి ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ శనివారం జీ తెలుగులో ప్రసారమయ్యే కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 సినిమా చూడాల్సిందే!

ఈ సినిమాలో పాన్ఇండియా స్టార్ రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రలు పోషించగా, జయరామ్, రాకేష్ పూజారి వంటి ప్రముఖులు ఇతర ముఖ్యపాత్రల్లో మెప్పించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఆకట్టుకునే కథ, కథనం, భావోద్వేగాలు కలగలసిన యాక్షన్ ఎంటర్టైనర్ కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 సినిమాని మీరూ మిస్ కాకండి!

సంస్కృతి, సంప్రదాయాలే ప్రధానంగా సాగే 'కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1'.. ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!

Advertisement
KantaraTollywoodMovie News

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News