జీ తెలుగు సంక్రాంతి సందడి.. 'మిత్ర మండలి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు!

హైదరాబాద్, 10 జనవరి 2026: ప్రతి పండగ మాదిరిగానే ఈ సంక్రాంతి వేళ తెలుగు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందించడానికి జీ తెలుగు సిద్ధమైంది. కామెడీ డ్రామా 'మిత్ర మండలి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో పాటుటాలీవుడ్ స్టార్స్ సందడి చేసిన సంక్రాంతి స్పెషల్ 'సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు' ఈవెంట్‌ను అందిస్తోంది. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ జంటగా అలరించిన మిత్రమండలి జనవరి 11 (ఆదివారం) మధ్యాహ్నం 3:30లకు, మాస్మహారాజ్ రవితేజ సందడి చేసిన 'సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు' సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

విజయేందర్ ఎస్ దర్శకత్వంలో వచ్చిన 'మిత్ర మండలిసినిమా కథ చైతన్య (ప్రియదర్శి)సాత్విక్ (విష్ణు ఓయ్)అభి (రాగ్ మయూర్)రాజీవ్ (ప్రసాద్ బెహరా) అనే నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. అయితేవీరి జీవితం ఒక పవర్‌ఫుల్ పొలిటిషియన్ కూతురైన స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్) ప్రవేశంతో ఊహించని మలుపు తిరుగుతుంది. ప్రేమలో పడిన తన స్నేహితుడికి సహాయం చేయబోయిఈ నలుగురూ ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారుఆ గందరగోళం నుండి ఎలా బయటపడ్డారుఅనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే మిత్ర మండలి సినిమా చూసేయండి!

అంతేకాదు, సంక్రాంతి సంబరాలను స్టార్ యాంకర్లు ప్రదీప్ మాచిరాజుసుధీర్ తమదైన శైలిలో హోస్ట్ చేస్తూ వినోదాన్ని పంచుతారు. ముఖ్యంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి వీరిద్దరి పెళ్లిఆశల గురించి చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. మెగా విక్టరీ సాంగ్‌ను రీక్రియేట్ చేయడంతో పాటుసుధీర్-ప్రదీప్ పట్ల అమ్మాయిలు చూపే ప్రేమఒకరి అభిమానులను మరొకరు ఎగతాళి చేసుకునే సరదా సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. 'భర్త మహాశయులకు విజ్ఞప్తిపేరుతో చిన్న పిల్లలు వేసే స్కిట్లు ఈ షోలో హైలైట్‌గా నిలుస్తాయి.

ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ తన హీరోయిన్లు డింపుల్ హయాతిఆషికా రంగనాథ్‌లతో కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. లిఖితపూజా నాగేశ్వర్ జానపద నృత్యాలుఇర్యా కామెడీ సెగ్మెంట్లు షోకు అదనపు బలాన్ని ఇస్తాయి. ఇక సాయంత్రాన్ని మరింత కలర్ ఫుల్ గా మారుస్తూ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ 'ది రాజా సాబ్హీరోయిన్లు నిధి అగర్వాల్మాళవిక మోహనన్రిద్ధి కుమార్ స్పెషల్ ఎంట్రీ ఇస్తారు. సరదా కబుర్లు, అల్లరి, ఆటపాటలతో సందడిగా సాగిన జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం ‘సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు’ మీరూ మిస్ కాకుండా చూసేయండి!

జీ తెలుగు అందిస్తున్న ఈ సంక్రాంతి ధమాకా ప్రతి ఇంటా నవ్వులను పూయిస్తుందనడంలో సందేహం లేదు.. డోంట్ మిస్!


More Press Releases