అంగరంగ వైభవంగా జరిగిన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025, రెడ్ కార్పెట్, పార్ట్ 2.. ఈ శుక్రవారం, శనివారం సాయంత్రం 5 గంటలకు, మీ జీ తెలుగులో!
హైదరాబాద్, 15 అక్టోబర్ 2025: తెలుగు ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందించే ఛానల్ జీ తెలుగు. నటీనటులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే 2025 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ను అందించనుంది. టాలీవుడ్ ప్రముఖులు, జీ తెలుగు తారల సందడితో కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమం మొదటి భాగం ఇప్పటికే ప్రసారం కాగా, రెండో భాగాన్ని ప్రసారం చేయనుంది. ఈ మెగా ఈవెంట్ రెడ్ కార్పెట్ పార్ట్-2 శుక్రవారం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం పార్ట్ 2 ను శనివారం మీముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. అలరించే ప్రదర్శనలు, హృదయాన్ని హత్తుకునే క్షణాలు, మరపురాని అనుభవాలతో తెలుగు టెలివిజన్ స్ఫూర్తిని ప్రతిబింబించే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 రెడ్ కార్పెట్, పార్ట్-2 అక్టోబర్ 17,18 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు, మీ జీ తెలుగులో!
తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్ 2 అద్భుతమైన ప్రదర్శనలు, అలరించే సంభాషణలు, కన్నీళ్లు పెట్టించే ఉద్వేగ క్షణాలతో మీ ముందుకు రానుంది. ఎనర్జిటిక్ యాంకర్స్ సుధీర్, రవి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. దశావతారం ప్రేరణతో చేసిన నృత్యం, నాస్టాల్జిక్ రెట్రో సాంగ్స్ ఫెర్ఫామెన్స్, మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ సాంగ్స్కి సీరియల్ హీరోయిన్లతో కలిసి సుధీర్ చేసిన డాన్స్, ఫరియా అబ్దుల్లా బెల్లీ డాన్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి. సీరియల్ టీమ్లతో రవి, సుధీర్ ఆడించే బంతి ఆట అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది.
ఆటో విజయశాంతి సీరియల్ నుంచి చిరంజీవి(స్వామినాథన్) తన ప్రియురాలి కోసం పాడే పాట అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జగద్ధాత్రిగా జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న దీప్తి మన్నె పెళ్లి ప్రకటించడంతో అందరూ కలిసి పెళ్లికూతురుని చేస్తారు. పడమటి సంధ్యారాగం జంట రఘురాం (సాయి కిరణ్), జానకి (జయశ్రీ) తమ భావాలను మంచి పాటతో పంచుకుంటారు. అమ్మాయిగారు సీరియల్ ఫేమ్ యశ్వంత్ తన తల్లిదండ్రులకు ఎమోషనల్ ట్రిబ్యూట్‌తో ప్రేక్షకులను కదిలిస్తాడు. సరిగమప గాయనీగాయకుల ప్రదర్శన అందరి హృదయాలను తాకుతుంది. మంచు మనోజ్ తన భార్యకు పాటను అంకితం చేస్తూ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 వేదికపై మరోసారి ప్రపోజ్ చేస్తాడు. మిరాయి సినిమా నుంచి హిలేరియస్ బ్లాక్ స్వార్డ్ స్కిట్, రాజా అవార్డు గెలుచుకున్న మూమెంట్ స్పూఫ్‌తో డ్రామా జూనియర్స్ పిల్లలు నవ్వులు పూయిస్తారు. సరదాలు, సంతోషాలు, సంబరాలు, ఉద్వేగాల సమాహారంగా సాగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్ 2ను మీరూ తప్పకుండా చూసేయండి!
కన్నుల పండుగగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 రెడ్ కార్పెట్, పార్ట్ 2, శుక్రవారం, శనివారం (అక్టోబర్ 17, 18) సాయంత్రం 5 గంటలకు మీ జీ తెలుగులో!