సూపర్హిట్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, ఈ శుక్రవారం జీ5లో, ఆదివారం జీ తెలుగులో.. డోంట్ మిస్!

: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. హారర్ థ్రిల్లర్గా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ‘కిష్కింధపురి’ సినిమాని ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ‘కిష్కంధపురి’ శుక్రవారం(అక్టోబర్ 17) జీ5లోఆదివారం (అక్టోబర్ 19) సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులోతప్పక చూడండి!
కిష్కింధపురి సినిమా కథ రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఈ జంట కిష్కింధపురి పట్టణంలో ఘోస్ట్-వాకింగ్ టూర్‌లను నిర్వహించే ఒక కంపెనీలో పనిచేస్తారు. ఒక టూర్ సందర్భంగా కొంతమంది సందర్శకులను సువర్ణమాయ అనే పాత రేడియో స్టేషన్‌కు తీసుకెళతారు. అయితే, సువర్ణమాయలోకి ప్రవేశించిన టూరిస్ట్లు ఒక్కొక్కరుగా చనిపోతారు. ఆ మరణాలకు కారణం ఏంటి? టూరిస్టులను చంపేది ఎవరు? రాఘవ్, మైథిలి సమస్యను ఎలా పరిష్కరించారు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ5, జీ తెలుగు వేదికగా ప్రసారం కానున్న కిష్కింధపురి సినిమాను చూడాల్సిందే!
ఆసక్తికరమైన కథ, అద్భుతమైన తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించగా, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, హైపర్ ఆది, మకరంద్ దేశ్‌పాండే, సుదర్శన్ వటి ప్రముఖ నటులు ఇతర పాత్రలు పోషించారు.  
కిష్కింధపురి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌.. జీ 5, జీ తెలుగులో ఈ శుక్రవారం మరియు ఆదివారం.. తప్పక చూడండి!

More Press Releases