హైదరాబాద్‌లో తనదైన శైలిలో పెయింట్ స్టూడియోను ప్రారంభించిన బిర్లా ఓపస్ పెయింట్స్- మీ అన్ని పెయింటింగ్ అవసరాలకు అనువైన ప్రదేశం

Business
Advertisement

•కస్టమర్-కేంద్రీకృత విధానంతో ఏర్పాటైన హైదరాబాద్‌లోని కొత్త పెయింట్ స్టూడియో, ఇంటి యజమానులకు లీనమయ్యే, వ్యక్తిగతీకరించిన పెయింటింగ్ అనుభవాన్ని అందించడానికి బిర్లా ఓపస్ పెయింట్స్  నిబద్ధతకు అనుగుణంగా ఏర్పాటైంది.

•నిపుణుల సంప్రదింపులతో అత్యాధునిక సాంకేతికతను సమగ్రపరచడం ద్వారా, హైదరాబాద్ పెయింట్ స్టూడియో అలంకరణ రంగంలో అనుభవపూర్వక రిటెయిల్‌కు డిమాండ్‌ను పెంచుతోంది. 

28 ఏప్రిల్ 2025, హైదరాబాద్: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన బిర్లా ఓపస్ పెయింట్స్, ఈరోజు హైదరాబాద్‌లో తన బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను (కంపెనీ యాజమాన్యంలోని మరియు కంపెనీ ఆపరేటెడ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్) ప్రారంభించామని ప్రకటించింది. గురుగ్రామ్, లక్నో, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరులో ఇప్పటికే విజయవంతంగా ప్రారంభించిన అనంతరం, పెయింట్ మరియు డెకర్ పరిశ్రమను ఆవిష్కరణ, ప్రీమియం ఆఫర్‌లు మరియు నిజంగా లీనమయ్యే కస్టమర్ అనుభవం ద్వారా మార్చాలనే బ్రాండ్  నిబద్ధతను ఈ విస్తరణ మరింత బలోపేతం చేస్తుంది.

బిర్లా ఓపస్ పెయింట్స్  హైదరాబాద్ స్టూడియో సాధారణ రిటైల్  ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకమైన, లీనమయ్యే అనుభవంగా మార్చడానికి ఆలోచనాత్మకంగా రూపొందించారు. ఈ పెయింట్ స్టూడియో సంప్రదాయ పెయింట్ దుకాణాలకు అతీతంగా సృజనాత్మకతకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ కేంద్రం. ఇది వినియోగదారుల సృజనాత్మకతను మరింత కొత్తగా ఆవిష్కరించుకునేందుకు, నిజ జీవిత వాతావరణంలో రంగులను తాకడానికి, అనుభూతి చెందడానికి మరియు ఆస్వాదించేందుకు అనుమతిస్తుంది. వినియోగదారుల వ్యక్తిగతీకరించిన గైడ్ ద్వారా షేడ్ ఎంపిక, టెక్చర్‌లు, వినియోగించే నైపుణ్యాలపై నిపుణుల నుంచి ఉచిత మార్గదర్శకత్వాన్ని కూడా పొందవచ్చు. అధునాతన విజువలైజేషన్ సాధనాలు ఇంటి యజమానులు వారు ఎంచుకున్న రంగులు నిజ జీవిత సెట్టింగ్‌లలో ఎలా కనిపిస్తాయో ముందస్తుగా వీక్షించేందుకు సహాయపడతాయి. పెయింట్‌లకు మించి, పెయింట్ స్టూడియో వాల్‌కవరింగ్‌లు, డిజైనర్ ఫినిషింగ్‌లు మరియు సమగ్ర డెకర్ సొల్యూషన్ కోసం స్పెషాలిటీ కోటింగ్ ఎంపికలను కూడా కలిగి ఉంది.

ఈ స్టోర్ 170 కన్నా ఎక్కువ ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, రంగుల ఎంపికపై నిపుణుల సంప్రదింపులు, వినూత్న అప్లికేషన్ టెక్నిక్‌లు మరియు గొప్ప స్థానిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన క్యూరేటెడ్ డెకర్ సొల్యూషన్‌లతో సహా పలు ప్రత్యేక సేవలను అందిస్తుంది. ఇది స్థానిక అభిరుచులు, వారసత్వానికి అనుగుణమైన ఎంపికలతో శక్తివంతమైన నగర స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రత్యేకమైన షేడ్స్‌ను క్యూరేటెడ్ డెకర్ ప్యాకేజీలను అందిస్తుంది. భారతదేశం వ్యాప్తంగా, తన రిటైల్ పాదముద్రను విస్తరించే లక్ష్యంతో బిర్లా ఓపస్ పెయింట్స్ వృద్ధి వ్యూహంలో ఈ ప్రారంభం కూడా ఒక ముఖ్యమైన అడుగు. అనుభవపూర్వక రిటైల్‌పై దృష్టి సారించి, రాబోయే నెలల్లో ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్ మరియు సూరత్‌లలో అదనపు అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ, “హైదరాబాద్‌లోని మా కొత్త పెయింట్ స్టూడియో కేవలం రిటైల్ స్థలం మాత్రమే కాదు, ఇది మీ పెయింటింగ్ అవసరాలకు ఒక అనుభవ కేంద్రం. అత్యాధునిక సాంకేతికత నుంచి స్థానికంగా ప్రేరణ పొందిన షేడ్ ప్యాలెట్‌ల వరకు, వినియోగదారులు, నిపుణులు అన్వేషించేందుకు, ప్రయోగాలు చేయడానికి, వ్యక్తీకరించడానికి మేము ఒక స్థలాన్ని సృష్టిస్తున్నాము. భారతదేశం పెయింట్‌లతో నిమగ్నమయ్యే విధానాన్ని మార్చడానికి, పెయింటింగ్ ప్రయాణాన్ని మరింత వ్యక్తిగతీకరించేందుకు, లీనమయ్యేలా మరియు స్ఫూర్తిదాయకంగా మార్చడానికి మా నిబద్ధతను ఈ స్టూడియో ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు.
ప్రతి బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో ఆర్కిటెక్ట్‌లు మరియు ఇంటీరియర్ డిజైనర్‌లకు కేంద్రంగా పనిచేస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన వర్క్‌స్పేస్‌తో వనరులు, నమూనాలు, నిపుణుల మద్దతుతో నిపుణులు సులభంగా సహకరించేందుకు, సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. అనుభవ కేంద్రాలు మా పెయింట్ క్రాఫ్ట్ పెయింటింగ్ సేవ ద్వారా పెయింటింగ్ సేవలను కూడా అందిస్తాయి. 

అదే విధంగా, ప్రతి పెయింట్ స్టూడియో స్థానిక సంస్కృతి, వారసత్వం మరియు ఆర్కిటెక్చర్ నుంచి ప్రేరణ పొందిన షేడ్స్‌ను కూడా కలిగి ఉంటుంది. బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో చిరునామా:
సర్వే నం.129, రెనాల్ట్, 35/D1, రోడ్ నం. 12, ఆనంద్ బంజారా కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500034

About Birla Opus Paints:

Birla Opus Paints, housed under Grasim Industries, Aditya Birla Group’s flagship firm, offers Decorative Painting Solutions to consumers in India. Launched in 2024, Birla Opus Paints has a complete portfolio featuring a range of superior products across categories like interiors, exteriors, waterproofing, enamel paints, wood finishes, and wallpapers. With six manufacturing plants spread across India, Birla Opus Paints is well positioned to be amongst the market leaders in the decorative paints category. The brand aims to inspire people to turn their surrounding spaces into their very own masterpiece.

***

Advertisement
Birla Opus Paints

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News