ఏఐ వర్సిటీ, డేటా సెంటర్లు రాబోతున్నాయి... పెట్టుబడులకు ఇదే సరైన సమయం: లోకేశ్

Local
Advertisement
శాన్ ఫ్రాన్సిస్కో: ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్టాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. యూఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా  ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని, రాబోయే రోజుల్లో ఏపీ స్టార్టప్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు కాబోతోందని చెప్పారు. ‘‘పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నాం. ఎటువంటి జాప్యం లేకుండా అనుమతుల కోసం ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్ధరించాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, వైద్యపరికరాల తయారీ, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సహం అందించాలని నిర్ణయించాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో త్వరలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులను తీర్చిదిద్దేందుకు వీలుగా ఏఐ యూనివర్సిటీని ఏర్పాటుచేయబోతున్నాం. అన్నివిధాలా అనుకూల వాతావరణం నెలకొన్న ఏపీలో పెట్టుబడులు పెట్టండి’’ అని లోకేశ్ కోరారు.

ఈ సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ రంగస్వామి, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కవితా మరియప్పన్ (జడ్ స్కేలర్), శివ శివరాం (సీఈవో, క్వాంటమ్ స్కోప్), రమాకాంత్ ఆలపాటి (సీఈవో, యూల్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్), సోహిల్ చావ్లా (ఫౌండర్ అండ్ సీఈవో టి సెకండ్), అన్యా మాన్యుయల్ (ప్రిన్సిపాల్, రైస్ హాడ్లీ గేట్స్ అండ్ మాన్యుయల్ ఎల్ఎల్‌సీ), రియా షిమా (గ్లోబల్ బిజినెస్ హెడ్, జెట్ సింథసిస్), డీన్ గార్ ఫీల్డ్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, నెట్ ఫ్లిక్స్), మిచైల్ డిపాలా కోయ్లే (హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ, ఐబీఎం), నిక్ క్లెగ్ ( ప్రెసిడెంట్, మెటా గ్లోబల్ ఎఫైర్స్), బెకీ ఫ్రాసర్ ( వైఎస్ ప్రెసిడెంట్, క్వాల్కమ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), చంతాల్ అలకంత్రా (ఎండీ, లాంరీసెర్చ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), ప్రభురాజా (ప్రెసిడెంట్, సెమీకండక్టర్స్ ప్రొడక్ట్ గ్రూప్, అప్లయ్డ్ మెటీరియల్స్), గ్రేస్ కోహ్ (వైస్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ రిలేషన్స్, సియానా), తోబి యాంగ్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్), స్టాట్ ఆంటోని (పార్టనర్, కోవింగ్టన్ & బర్లింగ్), ఎమి హరియానీ (సీనియర్ అడ్వయిజర్, యుఎస్ఐబిసి) , ఇండియాస్పోరా ప్రతినిధులు ముద్దు సుధాకర్ (ఆసియారా), శ్రీ సతీశ్ అంబటి (హెచ్20 ఎఐ), భాస్కర్ శ్రీనివాసన్ (ఏవియేషన్ టెక్నాలజీ లిమిటెడ్), శ్యామ్ బాలాజీ (డెలాయిట్), సంజయ్ ఖండవేరు (ఐవీక్యాప్ వెంచర్స్), కృష్ణ యార్లగడ్డ (ఫాల్కన్ ఎక్స్), ప్రభ భాష్యం (యాపిల్), ప్రియా రామచంద్రన్ (జోమ్ క్యాపిటల్), రాజీ భాస్కర్ (సూపర్ బ్లూమ్), రాజురెడ్డి (సియారా అట్లాంటిక్), రాకేష్ వైద్య నాథన్ (ధ జై గ్రూప్), రమణన్ షణ్ముగం (ఒవెన్యూ), రావి రవికుమార్ (కోటా క్యాపిటల్), సతీశ్ కంచి (వన్ హబ్, పీవోఎస్), జియా రెహమాన్ (స్ప్రౌట్ ఎఐ), అనిల్ అద్వానీ (ఇన్వెంటస్ లా), నవ దావులూరి, శివచైతన్య (ఇంటరాక్ట్లీ ఎఐ), నవ్య దావులూరి (క్యూరీ ఎఐ), అంజి మారం (క్రిటికల్ రివర్), విశేష్ పువాడి (హెచ్ఎస్ బీసీ), ప్రసాద్ ఆకెళ్ల (ఆప్టెస్సా), సంజయ్ వర్మ (అలిక్స్ పార్టనర్స్), మనోహర్ పాలూరి (మెటా), రాంభూపాల్ (డైకెమ్) పాల్గొన్నారు.
Advertisement
Nara LokeshIndiasporaUSAAndhra Pradesh

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News