గౌతమ్ తిన్ననూరి మ్యూజికల్‌ డ్రామా 'మ్యాజిక్'

గౌతమ్ తిన్ననూరి  మ్యూజికల్‌ డ్రామా 'మ్యాజిక్'
భారీ చిత్రాలతో పాటు కంటెంట్‌ కొత్తవారిని ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తుంది సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. ఈ కోవలోనే జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో మ్యాజిక్‌ అనే సినిమాను సితార సంస్థ నిర్మిస్తోంది. నూతన నటీనటులతో మ్యూజికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.  

మ్యాజిక్‌' చిత్రానికి సంగీత అందిస్తున్న అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా, నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.  డిసెంబర్ 21, 2024న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు .నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ తమ కళాశాల ఫెస్ట్‌ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టు తిరిగే కథ తిరుగుతుంది.  ఈ సినిమాలో యువతను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. కల నెరవేరాలంటే మొదట ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాన్ని అందమైన ప్రయాణంలా చూపించే 'మ్యాజిక్' చిత్రం, థియేటర్లలో ప్రేక్షకులను మాయ చేయనుంది' అన్నారు. 

ప్రముఖ ఛాయాగ్రాహకుడు గిరీష్ గంగాధరన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న 'మ్యాజిక్'  చిత్రానికి, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి
MAGIC
Magic release date
Gowtham Tinnanuri

Watch Today's Deals on Amazon

More Press News