ఓటేయడానికి అలసత్వం ప్రదర్శిస్తే..ఐదేళ్ల భావితరం బానిసత్వమే!

Related image

*ఓటేయడానికి అలసత్వం ప్రదర్శిస్తే..ఐదేళ్ల భావితరం బానిసత్వమే!*

*నేను ఒక్కడినే ఓటేయకపోతే మన తలరాతలు మారవు కదా? అనే ధోరణి మారాలి* 

*శ్రీమతి భాగ్య సూర్యలక్ష్మి ఆకుల*

దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు. ఐదేళ్ల మన భవిష్యత్ ను నిర్ణయించుకునే ఏకైక అస్త్రం. మన ప్రాంతాన్ని పాలించే నాయకున్ని ఎన్నుకునే బ్రహ్మాస్త్రం.వంద శాతం పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వ ప్రయత్నాలు చేస్తున్నా ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.పైగా, నేను ఒక్కడినే ఓటు వేయకపోతే మన తలరాతలు మారవు కదా? అనే ప్రశ్నతో ఎవరికి వారు సమర్థించుకునే ధోరణి ఎక్కువయింది. వాస్తవానికి, మీ ఒక్క ఓటుతోనే మన తలరాతలు మార్చగలరు. అవును..నిజం. ఐదేళ్లకోసారి మన భవిష్యత్ కోసం ఒక్క గంట కేటాయిస్తే చాలు..నిజంగానే మన తలరాతతో పాటు, చాలా మంది తలరాతలు మారుతాయి. లేదంటే ఓటు వేయడంలో నిర్లిప్తత కారణంగా అనామకులను అందలమెక్కించిన వారవుతారు. గత ఎన్నికలో దాదాపు మూడింట ఒక వంతు మంది గత లోక్‌సభ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా దూరంగా ఉన్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదంలో ఉందో అవగతమవుతోంది. 

ఓటేసినప్పుడే ప్రజాప్రతినిధిని నిగ్గదీసి, నిలదీసే హక్కు ఉంటుందని యువతరం తెలుసుకోవాలి. ఓటర్లను తరలించడానికి, ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేయడానికి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆశించినంత ఫలితాలు రావడం లేదు. మరీ ముఖ్యంగా గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్లే తమ హక్కు వినియోగంపై అలసత్వం ప్రదర్శిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలు మినహా సాధారణ ఎన్నికల్లో పోలింగ్ 75 శాతం మించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో యువత అవగాహన పెంచుకోవాలి. అందుకే నేషనల్ ఓటర్స్ డే 2023లో  ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 'నథింగ్ లైక్ ఓటింగ్ ..ఐ ఓట్ ఫర్ ష్యూర్'. ఓటేయడం కన్నా విలువైంది ఏదీ లేదు...నేను కచ్చితంగా ఓటేస్తాను అని తెలుగులో ఈ నినాదం అర్థం. సుదీర్ఘ కాలం క్యూలైన్లో ఉండి ఓటు వేసేందుకు యువతీయువకుల అనాసక్తికి ప్రధాన కారణం. రెండు నెలల కాలం ఎలక్షన్ కి సమయం ఉండడం కూడా అభ్యర్థులకు అనుకున్న అంచనాలు దాటి ఖర్చు విపరీతంగా పెరిగే ప్రమాదముంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 60 దేశాల్లో 400  కోట్ల మంది ఓట్ల మహా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ఓటు వేయకుంటే మనల్ని మనం మోసం చేసుకోవడంతో పాటు ఇతరులకు నష్టం చేసిన వారిగా మిగులుతాం’’. సార్వత్రిక ఎన్నికల మహాకుంభమేళాలో 97 కోట్ల మంది ఓటర్లు తమ వజ్రాయుధాన్ని వినియోగించుకోబోతున్నారు. ఓటర్లలో 29 శాతం మంది 18 నుంచి 29 ఏళ్ల మధ్యవయసు యువతరమే. 2660 రాజకీయ పార్టీలు పాల్గొనే ఈ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి కూడా!  అధికారికంగా ఎన్నికల వ్యయంపై ఈసీ పరిమితులు విధించినప్పటికీ , పార్టీల ప్రచారం సహా, ఎన్నికల తతంగం మొత్తం ఖర్చు రూ.1.2 లక్షల కోట్లు దాటుతుందని అంచనా!

చరిత్ర చూస్తే..

భారతదేశం 1962 నుండి ఈ సంవత్సరం 97 కోట్లకు పైగా ఓటర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 30 కోట్ల మంది ఓటర్లలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు, యువ ఓటర్లు, వలస వచ్చినవారు ఉన్నారని గణాంకాలను ఉటంకిస్తూ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది, “గుజరాత్‌ వంటి ప్రధాన నగరాలలో 2017 ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతంలో క్షీణతను నమోదు చేయడమే కాకుండా 2022లో రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ ఓటింగ్‌ను నమోదు చేశాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రధానంగా పట్టణాల్లోనే అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైంది. దాదాపు అన్ని నియోజకవర్గాలు సంబంధిత రాష్ట్రాల రాజధాని జిల్లాలు లేదా ఇతర పట్టణ కేంద్రాలలో భాగంగా ఉన్నాయి. ఉదాహరణకు, కర్ణాటకలోని నియోజకవర్గాలు - బెంగళూరు సౌత్, బెంగుళూరు సెంట్రల్ మరియు బెంగుళూరు ఉత్తర - గత సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో మూడు అత్యల్ప ఓటింగ్ శాతం నమోదయ్యాయి. 1962 సాధారణ ఎన్నికల్లో 21.64 కోట్ల మంది ఓటర్లలో 55.42 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం మొదటిసారిగా 50 శాతం నమోదైంది. 2009 నాటికి, మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 71.70 కోట్లకు పెరిగింది, అయితే పోలింగ్ బూత్‌లలో 58.21 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది, ఇది 1962 కంటే శాతం పరంగా స్వల్ప పెరుగుదల. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 83.40 కోట్ల మంది నమోదైన ఓటర్లలో 66.44 శాతానికి పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 91.20 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు  67.40 శాతం మంది తమ ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌ల వరకూ వచ్చారు.

‘ప్రజాస్వామ్యంలో ఓటు మనకు ఒక గౌరవం, మన హక్కులను కల్పించింది., అది కాపాడే బాధ్యత మనది అలాంటప్పుడు ప్రతఒక్కరం ఓటు వెయ్యాలి. అయిదేళ్లు పాలించే ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలన్న రాజ్యాంగం బతికి ఉండాలంటే, ఓటు వేయడం అవసరము అనే భావన ఉండాలి. ఎప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షం ఉంటే రెండూ ఎడ్లబండి వలే ప్రజాస్వామ్యము రాజ్యాంగం పర్యవేక్షణలో ఉంటుంది. పరిపాలన బాగాలేదు అనుకున్నప్పుడు నిరసన తెలపడం ప్రజాస్వామ్యానికి విలువ. అదే విధముగా “ఓటు వేసి ప్రజా ప్రభుత్వానికి అధికారము ఇవ్వటం , ప్రతిపక్షానికి కూడా సమాన బలం కల్పిస్తేనే ఉభయ సభలో న్యాయం జరుగుతుంది. , కాకుంటే నియంత పాలన చూడక తప్పదు.”

More Press Releases