రోజూ 2 గంటల పాటు నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిద్దాం.. కార్పొరేటర్లకు మేయర్ పిలుపు

Related image

హైదరాబాద్, ఏప్రిల్ 21: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమం కోనసాగింపులో భాగంగా నగరంలోని కార్పొరేటర్లందరూ తమ వార్డు పరిధిలో ఈ శుక్రవారం నుండి వారం రోజుల పాటు ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు రెండు గంటలపాటు క్షేత్ర స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామా రావు ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్లో గత మూడు రోజుల నుండి ముమ్మరంగా గార్బేజ్ తొలగింపు, ముమ్మర పారిష్య నిర్వహణ కార్యక్రమం సాగుతోందని అన్నారు. దీనికి కొనసాగింపుగా కార్పొరేటర్లందరూ తమ పరిధిలో నిత్యం చెత్తతో ఉండే ప్రాంతాల్లో చెత్త తొలగింపు, వ్యాధుల వ్యాప్తి నిరోధానికి హైపో క్లోరైట్ ద్రావకాన్ని విస్తృతంగా స్ప్రేయింగ్ చేయించాలని కార్పొరేటర్లకు సూచించారు.

ప్రతీ ఒక్కరు ఇంటింటి నుండి చెత్తను స్వచ్ఛ ఆటోలకే అందించేలా చైతన్య పర్చాలని కార్పొరేటర్లకు తెలిపారు. నగరంలో విస్తృత స్థాయిలో వ్యాపిస్తున్న కోవిడ్-19 నిరోధానికి ప్రజాప్రతినిధులుగా మనం కీలక పాత్ర వహించాలని, దీనిలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను రోజు కనీసం రెండు గంటల పాటు పర్యవేక్షించాలని మేయర్ తెలియజేశారు.

ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించే విధంగా చైతన్య పర్చాలని కోరారు. తమ పరిధిలోని డిప్యూటీ కమీషనర్లు, మెడికల్ ఆఫిసర్లు, శానిటేషన్ సిబ్బందితో కలసి స్వచ్ఛ కార్యక్రమాలను పర్యవేక్షించాలని మేయర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

More Press Releases