'సమ్మర్ హాలిడేస్' మూవీ రివ్యూ
Advertisement
Summer Holidays Review
బాలనటులు ప్రధాన తారలుగా రూపొందే చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి అరుదైన కోవలో తెరకెక్కిన చిత్రమే 'సమ్మర్ హాలిడేస్' ఈ చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ఓ బాలల చిత్రంలా కాకుండా ఓ మెయిన్ కమర్షియల్ సినిమాకు చేసే స్థాయిలో ప్రచారాన్ని చేశారు. పాటలు, ప్రచార చిత్రాలతో అలరించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? ఈ సినిమా కథ ఏమిటి? అనేది తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో చదువుకుంటున్న కుర్రాడు ఆర్‌వీని (అరుణ్ దేవ్). ఎప్పుడూ ర్యాంకులు.. మార్కులు గురించి అడుగుతూ.. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఒత్తిడి చేస్తుంటాడు ఆయన తండ్రి (హర్షవర్థన్).కానీ ఆర్వీకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. తండ్రి అంటే ఉన్న భయంతో ఆ విషయాన్ని ఆయనకు చెప్పలేకపోతుంటాడు. ఇక వేసవి సెలవులు రావడంతో తల్లి (వాసుకి)తో కలిసి అమ్మమ్మ (జయసుధ) ఊరు తోటవారి పాలెంకి వెళతాడు. అక్కడే కేవీ (రోహన్ రాయ్) పరిచయం అవుతాడు. కేవీ చదివే ప్రభుత్వ పాఠాశాలకు సరదాగా వెళుతూ కేవీకి మంచి స్నేహితుడిగా మారతాడు.
అయితే తండ్రి చనిపోవడంతో కేవీ ఆర్థిక సమస్యల కారణంగా చదువుకుంటూనే వర్మ (రాజీవ్ కనకాల)య దగ్గర మామిడి తోట సాగుకు తీసుకోవడం, పేపర్ బాయ్‌గా పనిచేయడం వంటి పనులు చేస్తుంటాడు. ఎప్పటికైనా తన సంపాదనతో తల్లి (హరిణి)కి ఓ చీర కొనిపెట్టాలనేది కేవీ కోరిక. ఇక కేవీ కోరిక తీరిందా? ఆర్థిక సమస్యల నుంచి ఎలా గట్టెక్కాడు. కేవీతో స్నేహం చేసి ఆర్‌వీ ఎలా మారిపోయాడు? కేవీని చూసి ఏమీ నేర్చుకున్నాడు? వేసవి సెలవులను అమ్మమ్మ ఊరిలో ఆర్‌వీ ఎలా ఎంజాయ్ చేశాడు? ఈ కథలో సుమతి (బేబి ఖుషి) పాత్ర ఏమిటి అనేది? మిగతా కథ.
వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరు వెళ్లడం.. అమ్మమ్మ చేతితో గోరు ముద్దలు తినడం. ఆ ఊర్లో మామిడి తోటల్లో షికారు చేయడం, ఊరి కుర్రాళ్లతో ఆడుకోవడం.. వాళ్లకు స్నేహితులుగా మారటం.. చెరువులో ఈత కొట్టడం.. ఇవన్నీ ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఉండే మధుర జ్క్షాపకాలు. ఆ గోల్డెన్ డేస్ గుర్తుకు వస్తుంటే వచ్చే భావోద్వేగం.. ఇలా అన్నింటిని అనుభవించేలా చేస్తుంది ఈ సినిమా. అందరి జీవితాల్లో ఉంటే చిన్న కథ చుట్టు బలమైన భావోద్వేగాలు అల్లుకుని దర్శకుడు ఈ కథను తెరకెక్కించాడు. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా.. భావోద్వేగంగా ఉంటుంది. గ్రామాల్లో ఉండే స్వచ్చమైన స్నేహం ఎలా ఉంటుందో కూడా ఈ కథలో చూపించారు. బాల్యం అంటే కేవలం చదువొక్కటే కాదని.. ఆట పాట.. స్నేహం అన్నీ ఉండాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటూ ధైర్యంగా ఉండాలనే విషయం కూడా ఈ కథలో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు.
హింస, రక్తపాతంతో వస్తున్న సినిమాల మధ్య వచ్చిన ఈ సినిమా మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది. అమ్మమ్మ ఊరిలోకి వెళ్లగానే ఈ సినిమా అసలు కథ ప్రారంభమవుతుంది. ఇక అక్కడి సుంచి ప్రతి సన్నివేశం ఎంతో హృద్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మమ్మ జయసుధతో జరిగే సంభాషణలు... ఆర్‌వీ, కేవీ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. కేవీ లీజుకు తీసుకున్న మామిడి చెట్ల పూత తీసుకరావడం కోసం పడే పాట్లు అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా మనసుకు హత్తుకుంటుంది. జయసుధ, ఆర్‌వీ మధ్య వచ్చే సన్నివేశాలు.. కేవీ, వాళ్ల అమ్మ మధ్య చిత్రీకరించిన సీన్స్ అమ్మమ్మ ఇంటి నుంచి ఆర్వీ వెళ్లిపోయే సన్నివేశాలు అందర్ని భావోద్వేగానికి గురిచేస్తాయి.
కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం.. అవకాశం ఉన్న కూడా సినిమాలోని కొన్ని సన్నివేశాలు బలంగా చూపించకపోవడం మినహా ఈ సినిమాపై ఎలాంటి కంప్లైట్ లేదు.. అందరి జీవితాల్లోని జ్క్షాపకాలను ఒక్కసారిగా తట్టిలేపే విధంగా.. వేసవి సెలవులకి అమ్మమ్మ ఊరుకు వెళ్లొచ్చినట్లుగా మనసుకు ఎంతొ హాయినిచ్చే అందమైన చిత్రం ఇది.
బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న అరుణ్‌దేవ్ ఆర్‌వీగా ఒదిగిపోయాడు. అమాయకత్వంతో పాటు ఎమోషన్స్ కూడా తన పాత్రలో పండించాడు. రోహాన్ రాయ్ మాస్ కుర్రాడిగా తన నటనలో ఎనర్జీ చూపించాడు. అదే స్థాయిలో ఎమోషన్స్ సీన్స్‌లో కూడా నటించి పాత్రలో మెప్పించాడు. హర్షవర్థన్, వాసుకి తల్లిదండ్రులుగా కరెక్ట్‌గా కుదిరారు. వర్మ పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. జయసుధ సహజ నటన గురింంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సింజిత్ సంగీతం సినిమాకు ఎనర్జీగా నిలిచింది. సాయి ప్రకాశ్ బ్యూటిఫుల్ విజువల్స్ సినిమాను కలర్‌ఫుల్‌గా మార్చింది. దర్శకుడు శ్రీకర్ నయన్ తన ప్రతిభను చూపాడు. ముఖ్యంగా ఎమోషన్స్ సన్నివేశాలను పండించడంలో సక్సెస్ అయ్యాడు.ఎక్కడా కూడా సినిమా కథను దాటి వెళ్లకుండా ఎంతో నిజాయితీగా తను అనుకున్న కథను చెప్పే ప్రయత్నం కనిపించింది. ఇలాంటి కథను నమ్మి.. జడ్జ్ చేసి... నిర్మించిన నిర్మాత అభినందనీయుడు. ఫైనల్‌గా 'సమ్మర్ హాలీడేస్' ఓ మంచి తియ్యటి జ్క్షాపకం లాంటి సినిమా..

Movie Details
Movie Name: Summer Holidays
Genre: Family
Release Date: 6 Nov 2026
Cast: Rohan Roy, Arun, Khushi, Jayasudha, Rajeev Kanakala, Vasuki, Harshini, Harshavardhan
Director: Srikar
PRO: suresh kondi
Music: Sinjith Yerramalli
Banner: Dheeraj Mogilineni Entertainments
Review By: Maduri Madhu
Summer Holidays Rating: 2.75 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement