'కేడీ .. ది డెవిల్' (జీ 5) మూవీ రివ్యూ!
మాస్ యాక్షన్ హీరోగా కన్నడలో ధృవ్ సర్జాకి మంచి పేరు ఉంది. అలాంటి ధృవ్ సర్జా నుంచి మరో యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 15వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సంజయ్ దత్ .. శిల్పా శెట్టి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో కిచ్చా సుదీప్ అతిథి పాత్రను పోషించాడు. జూన్ 5వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
కాళిదాస్ (ధృవ్ సర్జా) బెంగుళూర్ సమీపంలోని ఒక విలేజ్ లో తన అన్నయ్య ధర్మ (రమేశ్ అరవింద్)తో కలిసి నివసిస్తూ ఉంటాడు. ధర్మ వివాహం చేసుకోడు. ఆ విలేజ్ లోని పిల్లలకు చదువు చెబుతుంటాడు. అందువలన ఆయనను అందరూ అభిమానిస్తూ ఉంటారు. కాళిదాస్ కి చిన్నప్పటి నుంచి చదువు అబ్బకపోవడంతో, కిరోసిన్ డీలర్ గా పనిచేస్తూ ఉంటాడు. అన్నయ్య అంటే ఆయనకి ప్రాణం. కండబలం ఉన్నప్పటికీ, అన్నయ్య చెప్పిన మార్గంలో నడుస్తుంటాడు.
ఆ ఊరు కుస్తీ పోటీలకు ప్రసిద్ధి. అయితే దేవా (సంజయ్ దత్)తో కుస్తీ ఆడటానికి ఎవరైనా భయపడాల్సిందే. మాఫియాతో లింకులున్న దేవా, ఆ కుస్తీ గ్రౌండ్ నుంచి తన అనుచరులను తయారు చేయడం మొదలుపెడతాడు. వాళ్లను తన ముఠాలో చేర్చుకుంటూ ఒక ప్రత్యేకమైన గ్యాంగ్ ను తయారు చేస్తాడు. అక్కడి ప్రజలకు తానంటే ఉన్న భయాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదగాలనే ప్రయత్నాలలో ఉంటాడు.
కాళిదాస్ తన అన్నయ్య ధర్మాతో పాటు, మరో ఇద్దరిని తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తుంటాడు. ఒకరు తనకి చిన్నప్పుడు రక్తమిచ్చి బ్రతికించిన దేవా అయితే, మరొకరు తాను ఇష్టపడిన కొడవలి లక్ష్మి (రీష్మా). దేవాతో పటు ఆమె భార్య అయిన సత్యవతి (శిల్పా శెట్టి)ని కూడా కాళిదాస్ ఎంతో గౌరవిస్తుంటాడు. దేవా చేసే అరాచకాలకు సత్యవతి పూర్తి సపోర్టు ఉంటుంది. అతను తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఆమె భావిస్తూ ఉంటుంది.
ఒకానొకసారి కుస్తీలో దేవా ఆటతీరును కాళిదాస్ తప్పుబడతాడు. ఎలా ఆడాలో చెబుతూ, దేవాను ఓడిస్తాడు. అప్పుడు జరిగిన అవమానాన్ని దేవా మనసులో పెట్టుకుంటాడు. సత్యవతి కూడా లోలోపలే రగిలిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దేవా మనుషుల కారణంగా లక్ష్మికి అవమానం జరుగుతుంది. అప్పుడు కాళిదాస్ ఏం చేస్తాడు? అన్నిరకాలుగా బలవంతుడైన దేవాను అతను ఎలా ఎదుర్కొంటాడు? ధర్మ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి కారణం ఏమిటి? అనేది మిగతా కథ.
ఈ కథ 1980లలో మొదలవుతుంది. ఒక మాఫియా ముఠా నాయకుడికీ .. అమాయకుడైన ఒక సాధారణ యువకుడికి మధ్య జరిగే కథ ఇది. ఎన్నో అరాచకాలు చేస్తూ వెళుతున్న దేవాను, తనకి ఒక చిన్న సాయం చేసిన కారణంగా మంచివాడిగా భావిస్తూ ఉంటాడు కాళిదాసు. అయితే అదే దేవా కారణంగా తన కుటుంబం ప్రమాదంలో పడినప్పుడు కాళిదాస్ ఏం చేస్తాడు? అనే ఒక అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.
సమర్థులైనవారు .. బలవంతులు సహనంతో ఉండటం చాలా అరుదు. తమచుట్టూ ఉన్నవాళ్లలోను మంచితనాన్ని మాత్రమే చూస్తూ సర్దుకుపోతుంటారు. అలాంటివారిని రెచ్చగొడితే ఏం జరుగుతుంది? మంచివారి కోపం ఎంత తీవ్రంగా ఉంటుంది? తమ కుటుంబం కోసం ఎంతకష్టమైనా పడే అలాంటివాళ్లు, ఆ కుటుంబమే ఆపదలో పడే పరిస్థితి వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అనే అంశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు.
హీరో వైపు నుంచి చూస్తే, అన్నకోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడని ఒక తమ్ముడు. విలన్ వైపు నుంచి చూస్తే తన భర్తను సపోర్ట్ చేసే విలన్ భార్య సత్యవతి. ఈ రెండు కుటుంబాలకు మధ్యలో 'లక్ష్మి' అనే హీరోయిన్ పాత్ర. ఈ ఐదు పాత్రల చుట్టూనే ప్రధానమైన సన్నివేశాలు ప్లే అవుతూ ఉంటాయి. కథా పరంగా చూసుకుంటే, ఏ మాత్రం కొత్తదనం లేకుండా ఒక రెగ్యులర్ ఫార్ములాను ఫాలో అవుతూ వచ్చిన సినిమానే ఇది.
ఫస్టాఫ్ లో చాలావరకూ కథను సాగదీస్తూ వెళ్లారు. అలా ఎందుకు చేశారనేది మనకి సెకండాఫ్ చివరో తెలుస్తుంది. సీక్వెల్ కోసమని ఉన్న కథను దాచడానికి చేసిన ప్రయత్నం తాలూకు ప్రభావం ఫస్టాఫ్ పై పడిపోయింది. అలా కాకుండా ఇదే సినిమాలో చెప్పేసి ఉంటే, ఇంపాక్ట్ వేరేలా ఉండేదే. ఎందుకంటే సత్యవతి పాత్ర తాలూకు ఛాయలు అలా కనిస్తాయి. ఆ పాత్ర రంగంలోకి దిగడంతో సీక్వెల్ రానున్నట్టు చూపించారు.
ఇక ఫస్టాఫ్ లో హీరో - హీరోయిన్ మధ్య ప్రేమను పాటల్లో చూపిస్తే బాగుండేది.లేదంటే ఎమోషనల్ గా కనెక్ట్ చేసినా బాగుండేది. కానీ ఈ రెండు పాత్రల మధ్య అతివాగుడు పెట్టేసి, ఆడియన్స్ తో ఒక ఆట ఆడుకున్నారు. ఈ వయసులో సంజయ్ దత్ కుస్తీలు .. భవతి బిక్షామ్ దేహి అంటూ సత్యవతి పోలీస్ స్టేషన్ కి రావడం .. భైరవ పాత్రలో సుదీప్ ఎంట్రీ .. కాస్త ఓవర్ గా అనిపిస్తాయి. ఇక రవిశంకర్ పాత్రను పోలీస్ ఆఫీసర్ గా కాకుండా, ఎక్కడికక్కడ హీరో గురించి గొప్పలు చెప్పే పాత్రలో చూపించారు.
ఆర్టిస్టులంతా పాత్ర పరిధిలో నటించారు. విలియం డేవిడ్ ఫొటోగ్రఫీ .. అర్జున్ జన్య సంగీతం .. సంకేత్ ఆచార్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 'కేడీ .. ది డెవిల్' టైటిల్ కి తగినట్టుగానే హింసతో .. రక్తపాతంతో నడిచే కథ ఇది. విలన్ కంటే ఎక్కువ హింసకి పాల్పడే హీరో చేష్టలతో .. రొటీన్ కథాకథనాలతోనే నడిచే కంటెంట్ ఇది.

Movie Details
Movie Name: KD The Devil
Release Date: 2026-06-05
Cast: Dhruva Sarja,Sanjay Dutt ,Shilpa Shetty, Ravichandran ,Ramesh Aravind,Reeshma Nanaiah, Ravi Shankar
Director: Prem
Producer: Venkat K. Narayana
Music: Arjun Janya
Banner: KVN Productions
Review By: Peddinti
Trailer