'రేజర్' మూవీ రివ్యూ
నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు కొత్తతరహా సినిమాలతో ప్రయోగాలు చేస్తుంటాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాడు. ఇటీవల కొంత విరామం తరువాత ఆయన స్వీయ దర్శకత్వంలో చేసిన సినిమా 'రేజర్'. ఈ చిత్రంలో రవిబాబు ప్రధాన పాత్రలో నటించాడు.ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా వుంది? ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? లేదా రివ్యూలో తెలుసుకుందాం.
రాష్ట్ర హోమ్ మంత్రి కనకరాజు సీఎం పదవిని ఆశించి అతని కొడుకులతో కలిసి ముఖ్యమంత్రి సీతారాయమ్యను చంపేస్తారు. అయితే సీఎం ఫామ్ హౌస్‌లో అతడ్ని చంపుతున్న దృశ్యాలు అనుకోకుండా సీసీ టీవీ కెమెరాల బిజినెస్ చేసే విష్ణు (తనీష్) చేతికి దొరుకుతాయి. ఈ విషయం హోమ్ మంత్రి, అతని కొడుకులకు తెలియడంతో వాళ్లు విష్ణును, అతని భార్యను చంపేస్తారు. అయితే ఈ మర్డర్స్‌ను విష్ణు కూతురు తేజు చూస్తుంది. ఇక అదే సమయంలో ఆ ఇంటికి వారి డాగ్‌ను గ్రూమింగ్ చేయడానికి వచ్చిన మొబైల్ పెట్ గ్రూమింగ్ బిజినెస్ యజమాని రుద్ర (రవిబాబు) ఆ దుండగుల నుంచి తేజును కాపాడతాడు.
అయితే విష్ణు చనిపోయే ముందు సీఎంను హత్య చేసిన వీడియో క్లిప్పింగ్స్ ఎక్కడ ఉన్నాయో, తన కూతురు తేజుకు అసంపూర్తిగా చెప్పి చనిపోతాడు. ఇక తేజు పాపను హోమ్ మంత్రి, అతని బృందం చంపడానికి ఎన్ని సార్లు ప్లాన్ చేసిన రుద్ర వాళ్లను అడ్డుకుంటాడు. ఇక సీఎంను చంపే ఆ వీడియో క్లిప్పింగ్స్‌ను రుద్ర ప్రభుత్వానికి అప్పగించాడా? పాపను ఎలా కాపాడాడు? చివరికి ఏం జరిగింది? కనకరాజు సీఏం అయ్యాడా? ఈ విషయాలు తెలియాలంటే పూర్తి సినిమా చూడాలి.
ఈ సినిమాను మొదట్నుంచీ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ అంటూ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు దర్శక, నిర్మాత రవిబాబు. సినిమా ప్రారంభం కాస్త ఇంట్రెస్టింగ్‌గానే అనిపించినా.. కథనం ముందుకు వెళుతున్న కొద్ది ఆసక్తి సన్నగిల్లుతుంది. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకుండా కథానాన్ని నడిపించడం కష్టమే. ఆ ఇబ్బంది ఈ సినిమాకు ప్రారంభం నుంచి కనిపించింది. కథ, కథనాల కంటే ముఖ్యంగా యాక్షన్‌తో కూడిన హింసాత్మక సన్నివేశాలపై రవిబాబు దృష్టిపెట్టినట్లు అనిపించింది. ఈ చిత్రంలో రవిబాబు హింసను హద్దులు దాటించాడు. తలలను, శరీరాలను అత్యంత పాశవికంగా నరుక్కుంటూ వెళ్లిపోతాడు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను సున్నిత మనస్కులు చూడలేరు. థియేటర్‌లో రెగ్యులర్‌గా సినిమా చూసే ఆడియన్స్ కూడా అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు కళ్లు మూసుకుని ఉన్నారంటే ఆ సీన్స్ ఎంతో క్రూరంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సినిమాకు రవిబాబు తన కన్వీనెంట్ రైటింగ్‌తో ఎటువంటి లాజిక్‌లు లేకుండా సన్నివేశాలను అల్లుకున్నాడు. అయితే ఈ కథకు ప్రస్తుత టెక్నాలజీని లింక్ చేసి స్క్రీన్‌ప్లేలో వేగం పెంచాలని రవిబాబు చేసిన ప్రయత్నం మాత్రం అలరిస్తుంది. సీఎం మర్డర్‌కు సంబంధించిన క్లిప్పింగ్స్ ఎక్కడా ఉన్నాయో తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం, ఆ తరువాత ఆ క్లిప్పింగ్స్‌ను ఎవరి కంటా పడకుండా విష్ణు వాటిని దాచిపెట్టిన విధానం దాని కోసం అతను సాంకేతిక పరిజ్క్షానాన్ని యూజ్ చేసకున్న విధానం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అయితే రవిబాబు ఇలాంటి కథకు ప్రేక్షకుల్లో క్యూరియాసిటిని కలిగించే స్క్రీన్‌ప్లేను అల్లుకునే విషయంలో రచనా పరంగా మరింత టైమ్‌ను కేటాయిస్తే బెటర్ అవుట్‌పుట్ వచ్చేది. అత్యంత పాశవికంగా కనిపించిన ఆ హింస సన్నివేశాల డోసు విషయంలో కూడా కేర్ తీసుకోని ఉంటే సినిమాను ప్రేక్షకులు చూసే కోణం మారేది. ఓవరాల్‌గా లాజిక్ లేని కథ, కథనాలతో రవిబాబు క్రియేట్ చేసిన ఈ హింస చూడాలంటే ఈ హింసను భరించే ఓపికతో పాటు ధైర్యం కూడా కావాలి.
రవిబాబు సీరియస్ మూడ్‌లో తన పాత్రకు న్యాయం చేశాడు. సినిమా ఆద్యంతం రవిబాబే కనిపిస్తాడు. మిగతా పాత్రలు అలా వచ్చి వెళ్లిపోతాయి అంతే. ఈ సినిమా నేపథ్య సంగీతం, యాక్షన్ సన్నివేశాల డిజైన్ ఆకట్టుకుంటుంది. ఫోటొగ్రఫీ కూడా బాగుంది. విపరీతమైన హింస, లాజిక్ లేని కథ, కథనాలతో తెరకెక్కిన ఈ రేజర్‌కు ప్రేక్షకుల మెప్పు పొందడం కష్టమే. ఈ రేజర్ మేజర్ ఆడియన్స్‌ను అలరించే అవకాశాలు చాలా తక్కువ.

Movie Details
Movie Name: Razor
Release Date: 2026-05-08
Cast: Ravi Babu, tanish, benarji, hemanth
Director: Ravi babu
Producer: Ravi babu
Music: ss rajesh
Banner: Flying Frogs Production.
Review By: Maduri Madhu
Trailer