'సిటాడెల్ 2' (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!
ప్రియాంక చోప్రా .. రిచర్డ్ మాడెన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'సిటాడెల్' సిరీస్ లో, సీజన్ 1కి విశేషమైన ఆదరణ లభించింది. స్పై థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్, యాక్షన్ సీక్వెన్స్ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సిరీస్ నుంచి సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ కి వచ్చింది. 7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ఇంగ్లిష్ తో పాటు వివిధ భాషల్లో అందుబాటులో ఉంది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులచే 'మాంటికోర్' అనే ఒక వ్యవస్థ కొనసాగుతూ ఉంటుంది. హత్యలు చేయించడం మొదలు .. ప్రభుత్వాలను మార్చేయగల ఉన్మాదుల వ్యవస్థగా అది కొనసాగుతూ ఉంటుంది. 'మాంటికోర్'కి అడ్డుకట్ట వేయడానికి 'సిటాడెల్' అనే ఒక గూఢచారి వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. ఆ గూఢచారి విభాగంలో నాడియా (ప్రియాంక చోప్రా) మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్) బెర్నార్డ్ పనిచేస్తూ ఉంటారు. కానీ ఆ ఏజెంట్లు అందరూ ఇప్పుడు చల్లాచెదురై ఉంటారు. అందుకు కారణం మేసన్ కేన్ తల్లి దాలియా.
దాలియా 'మాంటికోర్'లో పనిచేస్తుందని తెలియని మేసన్, తమ గూఢచారి సంస్థకి సంబంధించిన ఏజెంట్ల జాబితాను ఆమెకి ఇస్తాడు. అలా చాలా మంది ఏజెంట్లు చనిపోవడానికి అతను కారకుడవుతాడు. ఆ ప్రమాదకర పరిస్థితి తరువాత, మేసన్ .. నాడియా .. బెర్నార్డ్ తలో దిక్కు అవుతారు. 'ఆబీ'ని పెళ్లి చేసుకున్న మేసన్, ఆమెతో ఆనందకరమైన జీవితాన్ని గడువుతూ ఉంటాడు. నాడియా తన కూతురు 'ఆషా'తో కలిసి జీవిస్తూ ఉంటుంది.
ఇక బెర్నార్డ్ మాత్రం 'పౌలో బ్రాగా' స్థావరంలో బందీగా ఉంటాడు. బెర్నార్డ్ తో పౌలో మైండ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను తయారు చేయిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి మెదడులో మైక్రో చిప్ ను అమర్చి, తన ఆదేశాలను ఆ వ్యక్తి పాటించేలా చేయడమే ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం. అలా తయారు చేసిన వ్యక్తితో ఒక దేశ అధ్యక్షుడిని చంపించాలానే ఆలోచనలో పౌలో ఉంటాడు. అలాంటి పరిస్థితులలో అక్కడి నుంచి బెర్నార్డ్ తప్పించుకుంటాడు.
అలా తప్పించుకున్న బెర్నార్డ్, మాజీ సీఐఏ ఆఫీసర్ 'హచ్ జిమ్' ఆశ్రయాన్ని పొందుతాడు. హచ్ కూడా పౌలో పై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో ఉంటాడు. అతని సాయంతో తన మిగతా టీమ్ సభ్యులను కలుసుకునే దిశగా బెర్నార్డ్ ముందుకు వెళతాడు. తన టీమ్ ను చేరుకున్న నాడియా ఏం చేస్తుంది? తన తల్లి చేసిన ద్రోహానికి ప్రతిగా మేసన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మాంటికోర్ నుంచి మానవాళిని కాపాడటం కోసం వాళ్లు ఏం చేస్తారు? అనేది కథ.
మెదడులో అమర్చబడిన మైక్రో చిప్ కారణంగా, తన ఆదేశాలను పాటిస్తూ మానవాళిపై విరుచుకుపడే హంతకులను తయారు చేయించడానికి పౌలో రంగంలోకి దిగడంతో ఈ సిరీస్ మొదలవుతుంది. గతంలో చెల్లాచెదురైపోయిన 'సిటాడెల్' ఏజెంట్లు, నిదానంగా కోలుకుని తిరిగి ట్రాక్ లో పడుతూ ఉండటంతో ఈ కథ జోరందుకుంటుంది. 'సిటాడెల్' టీమ్ అంతా ఒక దగ్గరికి చేరుకున్న దగ్గర నుంచి ఉత్కంఠభరితంగా మారుతుంది.
'సిటాడెల్'కి సంబంధించిన ఏజెంట్లకి ఎదురయ్యే ప్రమాదకరమైన సంఘటనలు, వాటి బారి నుంచి వాళ్లు బయటపడే తీరు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. తమ ఆపరేషన్ కి అవసరమైన 'ఎడిసన్' ను పట్టుకోవడానికి సిటాడెల్ ఏజెంట్లు ప్లాన్ చేసిన తీరు బాగుంది. అయితే మొదటి మూడు ఎపిసోడ్స్ తరువాత కథ కాస్త నిదానంగా నడుస్తూ వెళుతుంది. మేసన్ .. అతని తల్లికి సంబంధించిన సన్నివేశాలను, సంభాషణలతో సాగదీసిన భావన కలుగుతుంది.
'సిటాడెల్' మొదటి సీజన్ .. భారీతనమే ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. అందుకు ఎంత మాత్రం తగ్గని నిర్మాణ విలువలతో ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది. కథా పరంగా ట్విస్టులు ఉన్నప్పటికీ, అవి కొత్తగా ఏమీ అనిపించవు. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని అలరించే రీతిలోనే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. కథలో ఎమోషన్స్ కి పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదు .. ఉన్న కొద్ది ఎమోషన్ కనెక్ట్ కాలేదు.
పౌలో పాత్రను ఒక రేంజ్ లో పరిచయం చేశారు. తనదైన ప్రత్యేకమైన నేర సామ్రాజ్యాన్ని స్థాపించిన పౌలో, దేశ అధ్యక్షులను టార్గెట్ చేసే స్థాయిలో చక్రం తిప్పుతుంటాడు. అయితే ఆ తరువాత చోటుచేసుకునే సన్నివేశాలు ఆ పాత్ర స్థాయిని తగ్గించినట్టుగా అనిపిస్తుంది. అతను బంధించబడిన దగ్గర నుంచే కథ కాస్త నీరసించినట్టు కనిపిస్తుంది.
నటీనటుల నటన మెప్పిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ పనితీరు బలంగానే కనిపిస్తుంది. ఇది స్పై థ్రిల్లర్ కావడం వలన, అందుకు తగినట్టుగానే ఛేజింగులు .. యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కథ రొటీన్ గా అనిపిస్తుంది. కథనం నిదానంగా సాగుతుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు .. సంభాషణలు ఉన్నాయి. అందువలన నలుగురితో కలిసి చూడటం కాస్త ఇబ్బందినే కలిగిస్తుంది.

Movie Details
Movie Name: Citadel 2
Release Date: 2026-05-06
Cast: Priyanka Chopra, Richard Madden,Matt Berry,Michael Trucco,Jack Reynor
Director: Joe Russo
Producer: -
Music: -
Banner: The Russo Brothers - AGBO
Review By: Krishna
Trailer