'56 డేస్ ' .. హాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్. సైకలాజికల్ థ్రిల్లర్ ను టచ్ చేస్తూ సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. కేథరిన్ ర్యాన్ హోవార్డ్ రాసిన నవల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. 2021లో అత్యధికంగా అమ్ముడైన నవలలో ఇది ఒకటి. డవ్ కామెరాన్ - అవాన్ జోగియా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఇంగ్లిష్ తో పాటు ఇతర భాషల్లోను 8 ఎపిసోడ్స్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ 8 ఎపిసోడ్స్ కి నలుగురు దర్శకత్వం వహించారు.
'బోస్టన్'లోని ఓ ఇంట్లో ఒక దారుణమైన హత్య జరుగుతుంది. బాత్ టబ్ లో శవం కుళ్లిన స్థితిలో లభిస్తుంది. ఆ శవం పురుషుడిదా? స్త్రీకి సంబంధించిందా? అనే విషయం తేల్చడం సవాలుగా మారుతుంది. మిస్టరీగా మారిన ఈ మర్డర్ కేసును పరిష్కరించడానికి, ఆఫీసర్ 'లియార్డిన్' (కార్లా) ఆమె భర్త కార్ల్ ( డోరియన్) రంగంలోకి దిగుతారు. వాళ్లు ఆ ఇంటిని అణువణువున పరిశీలన చేస్తారు. హత్య జరిగిన ఆ ఇంట్లో అలీవర్ (అవన్ జోగియా) సియారా (కామెరాన్) ఉండేవారని తెలుసుకుంటారు. వాళ్లిద్దరూ ప్రేమికులై ఉంటారనే ఒక నిర్ధారణకు వస్తారు.
హత్య జరగడానికి ముందు, '56 రోజులు' వెనక్కి వెళితే, సియారా - అలీవర్ ల ప్రేమకథ కళ్లముందుకు వస్తుంది. అలీవర్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. గతం తాలూకు గాయం అతణ్ణి వెంటాడుతూ ఉంటుంది. అందువలన డాక్టర్ 'డాన్' దగ్గర అతను కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితులలోనే అతనికి సియారా (కామెరాన్) పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ సహజీవనం చేయడం మొదలు పెడతారు.
అలీవర్ తన జీవితంలోని కొన్ని రహస్యాలను సియారాతో పంచుకోలేని పరిస్థితి. ఇక వేరే ఊళ్లో సియారా ఫ్యామిలీ చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటుంది. అందువలన అలీవర్ ఎకౌంటులో నుంచి కొంత ఎమౌంట్ తీసి తన వాళ్లకి పంపించాలని నిర్ణయించుకుంటుంది. గతంలో తన కుటుంబానికి అలీవర్ చేసిన ద్రోహానికి అలా చేయడమే కరెక్ట్ అని ఆమె భావిస్తుంది. ఒకానొక దశలో ఒకరి మనసులో ఏముందో ఒకరికి తెలిసిపోతుంది. ఆ తరువాతనే హత్య జరుగుతుంది. ఎవరు ఎవరిని హత్య చేశారు? ఒకరితో ఒకరికి ముడిపడిన ఆ గతం ఏమిటి? అనేది కథ.
'56 డేస్'లో ఒక ప్రేమజంట జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి అనే ఈ కథ, ముందుగా నవలగా వ్రాయబడింది. ఆ తరువాతనే సిరీస్ గా ఇది తెరకెక్కింది. అందువల్లనే ఈ సిరీస్ ను చూస్తుంటే, ఒక పుస్తకాన్ని చదువుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. కథ .. కథలోని పాత్రలను డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఈ కథకి ప్రధానమైన బలం .. ప్రాణం అని చెప్పాలి.
కథ అంతా కూడా అంతకుముందు .. ప్రస్తుతం అన్నట్టుగా సాగుతుంది. అంటే ఒక వైపున ప్రేమకథను .. మరో వైపున హత్యకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటాయి. గతానికి సంబంధించిన కథ పూర్తయ్యే సమయానికి ప్రస్తుతానికి సంబంధించిన కథ ముగింపుకు వస్తుంది. అయితే ఈ ముగింపులో ట్విస్ట్ ఉంటుంది. చివరివరకూ ఈ ట్విస్ట్ ను అలా హోల్డ్ లో పెట్టేసి కథనాన్ని నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది.
కథలో పాత్రల సంఖ్య ఎక్కువే. ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం ఉంటుంది. హీరో వైపు నుంచి .. హీరోయిన్ వైపు నుంచి .. హత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్స్ వైపు నుంచి .. ఇలా అన్ని కోణాల్లో ఈ కథను అల్లుకుంటూ వచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి ఎక్కువగానే ఉంటుంది. అలాగని చెప్పి బోర్ అనిపించదు. ఎందుకంటే నెక్స్ట్ కథకు అవసరమైన ఫీడ్ ను ఈ ఎపిసోడ్ అందిస్తూ ఉంటుంది.
ఈ కథలో లవ్ ఉంది .. ఘాటైన రొమాన్స్ ఉంది .. సస్పెన్స్ ఉంది .. ఆడియన్స్ గెస్ చేయలేని ట్విస్టులు ఉన్నాయి. ముఖ్యంగా పాత్రలను ఎత్తుకోవడం .. వాటికి సరైన ముగింపును ఇవ్వడం కరెక్టుగా అనిపిస్తుంది. అలాగే ప్రధానమైన పాత్రలు చిత్రంగా ప్రవర్తించడానికి కారణంగా చూపించిన ఫ్లాష్ బ్యాక్ కూడా బలమైన డ్రామాతోనే కనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి బలమైన సపోర్టును అందించాయి.
ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. ప్రతి పాత్ర చివరివరకూ ఏదో ఒక సందర్భంలో కనెక్ట్ అవుతూనే ఉంటుంది. సాధారణంగా నవలలో పాత్రలు .. వాటి స్వరూప స్వభావాలు .. హావభావాలు .. డ్రామా .. ఆ పాత్రల ముగింపు పెర్ఫెక్ట్ గా అనిపిస్తూ ఉంటాయి. నవలను సిరీస్ గా తీయడం వలన, అంతే పెర్ఫెక్ట్ గా ఈ కంటెంట్ కనిపిస్తుంది. అయితే ఇది పెద్దలు మాత్రమే చూడదగిన సిరీస్. అక్కడక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి. అవి కూడా కాస్త ఘాటైనవే.
ఒక్కోసారి ప్రేమలో నుంచి ద్వేషం పుడుతుంది. కానీ ఆ ద్వేషంలో నుంచి కూడా ప్రేమ పుడుతుందని నిరూపించిన కథ ఇది. ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండటం సహజం. అయితే ఆ ప్రేమ కోసం రహస్యాలను అంగీకరించడం కూడా జరుగుతూనే ఉంటుందని చాటిన సిరీస్ ఇది. ఈ జోనర్ ను ఇష్టపడేవారు ఇంట్రెస్టింగ్ డ్రామాతో నడిచే ఈ కంటెంట్ ను అడల్ట్ కేటగిరిలో చూడొచ్చు.
'56 డేస్' (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!
56 Days Review
Movie Details
Movie Name: 56 Days
Release Date: 2026-02-18
Cast: Dove Cameron,Avan Jogia ,Megan Peta Hill,Dorian Missick ,Karla Souza
Director: Alethea Jones
Music: Nathan Barr
Banner: Carpool Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer