దలేర్ మెహందీకి అవమానం.. మంత్రిపై అనుపమ్ ఖేర్ అసహనం
- దలేర్ మెహందీకి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మద్దతు
- ఉత్తరాఖండ్లో వేదికపై దలేర్ను అవమానించిన మంత్రి
- దలేర్ మద్యం తీసుకోరని, ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదని వెల్లడించిన అనుపమ్
- కళాకారులను బహిరంగంగా అవమానించడం సరికాదని మంత్రిపై ఆగ్రహం
- మంత్రి తరఫున దలేర్కు క్షమాపణలు చెప్పిన అనుపమ్ ఖేర్
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అండగా నిలిచారు. ఓ కార్యక్రమంలో దలేర్ మహెందీని మంత్రి అవమానించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉత్తరాఖండ్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దలేర్ మెహందీ ప్రదర్శన ఇస్తుండగా, రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియాల్ వేదికపైకి వచ్చి ఆయనను తీవ్రంగా అవమానించారు. "మద్యం తాగి పాడుతున్నావు" అంటూ అందరి ముందు ఆరోపించడంతో ఈ వివాదం చెలరేగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అనుపమ్ ఖేర్ స్పందించారు. దలేర్ మెహందీకి అండగా నిలుస్తూ ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. "నాకు తెలిసినంత వరకు దలేర్ మద్యం సేవించరు. నేను కలిసిన మంచి వ్యక్తులలో ఆయన ఒకరు. గత రెండు, మూడేళ్లుగా ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదు. బహుశా నిర్వాహకులకు ముందుగా ఇచ్చిన మాట కోసమే ఆయన ఆ ప్రదర్శనకు హాజరై ఉంటారు. మాట నిలబెట్టుకోవడం ఆయన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను చూపుతుంది" అని అనుపమ్ పేర్కొన్నారు.
మంత్రి ప్రవర్తనను తప్పుబడుతూ "సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి నాకు చాలా బాధేసింది. బహిరంగ వేదికపై ఎవరూ ఎవరితోనూ అలా మాట్లాడకూడదు. ఇది అన్యాయం. ఒక గాయకుడిని అందరి ముందు విమర్శించడం సరికాదు. ప్రదర్శనపై మీకు కోపం ఉంటే, అదే విషయాన్ని విడిగా, గౌరవంగా కూడా చెప్పవచ్చు కదా? వేదికపైకి వెళ్లి అవమానించాల్సిన అవసరం ఏముంది?" అని అనుపమ్ ఖేర్ ప్రశ్నించారు.
ఈ ఘటన దలేర్కు ఎదురైనందుకు తాను చాలా బాధపడుతున్నానని, మంత్రి ప్రవర్తనకు తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. ఈ క్రమంలో మంత్రి తరఫున తానే దలేర్ మెహందీకి క్షమాపణలు చెబుతున్నానని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఈ సంఘటన కళాకారుల పట్ల ప్రజా ప్రతినిధులు వ్యవహరించాల్సిన తీరుపై చర్చకు దారితీసింది.