నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి: ప్రజలకు జేసీ ప్రభాకర్ రెడ్డి విన్నపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి: ప్రజలకు జేసీ ప్రభాకర్ రెడ్డి విన్నపం

JC Prabhakar Reddy asks people to forgive him for his past mistakes
  • కేతిరెడ్డి, భోగాతి నారాయణ రెడ్డిలను నమ్మవద్దన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
  • యల్లనూరు మండల ప్రజలు ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉండాలని సూచన
  • ఫ్యాక్షన్ రాజకీయాలతో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని తీవ్ర ఆవేదన
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యల్లనూరు మండల ప్రజలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, భోగాతి నారాయణ రెడ్డిలను అస్సలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్షన్ గొడవలకు, ప్రలోభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు ఆయన హితవు పలికారు.

ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... "భోగాతి నారాయణ రెడ్డి నాకు అత్యంత సన్నిహితుడైనప్పటికీ, రాజకీయాల విషయంలో ఆయన్ను నమ్మొద్దు. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఆ నష్టాన్ని తలుచుకుంటే ఇప్పుడు కూడా బాధ కలుగుతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను చేసిన తప్పులకు ప్రజలు క్షమించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

నాయకుల మధ్య ఉండే వ్యక్తిగత విభేదాలు శత్రుత్వానికి దారితీయకూడదని, వాటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదని జేసీ అన్నారు. "నాయకులు రాజకీయంగా పోటీ పడండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో తలపడండి. అంతేగానీ, అనవసర గొడవల్లోకి ప్రజలను లాగవద్దు. ఎన్నికల ద్వారానే ప్రజల మద్దతు పొందండి" అని ఆయన నాయకులకు సూచించారు. నాయకుల మధ్య వివాదాలతో సామాన్యులు నష్టపోకూడదనేదే తన ఉద్దేశమని జేసీ స్పష్టం చేశారు. 
Advertisement
JC Prabhakar Reddy
Tadipatri TDP
Faction Politics Andhra Pradesh
JC Prabhakar Reddy Apology
Kethireddy Pedda Reddy
Yellanur Politics

More Telugu News