సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో మంటలు.. తప్పిన ముప్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో మంటలు.. తప్పిన ముప్పు

Fire in Sirpur Kaghaznagar train major danger averted
  • సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో స్వల్ప అగ్నిప్రమాదం
  • యాదాద్రి జిల్లా బీబీనగర్ సమీపంలో ఘటన
  • బ్రేక్ లైనర్, చక్రం రాపిడితో చెలరేగిన మంటలు
  • ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడి
  • మరమ్మతుల తర్వాత రైలు తిరిగి ప్రయాణం
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో బుధవారం ఉదయం సిర్పూర్-కాగజ్‌నగర్ వెళుతున్న రైలులో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే, రైల్వే సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళితే, రైలు బీబీనగర్ స్టేషన్ సమీపానికి చేరుకుంటున్న క్రమంలో, ఒక బోగీ చక్రానికి బ్రేక్ లైనర్‌లు పట్టేయడంతో ఏర్పడిన రాపిడి వల్ల పొగలు, మంటలు చెలరేగాయి. దీనిని వెంటనే గమనించిన కో-పైలట్, లోకో పైలట్‌ను అప్రమత్తంచేయడంతో రైలును బీబీనగర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అగ్నిమాపక దళం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం సాంకేతిక సిబ్బంది అవసరమైన మరమ్మతులు పూర్తి చేయడంతో రైలు తిరిగి సిర్పూర్-కాగజ్‌నగర్‌కు బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Sirpur Kaghaznagar Express
Bibinagar Train Fire
Yadadri Bhuvanagiri Railway News
Indian Railways Accident

More Telugu News