వాట్సాప్‌లో ఈ నంబర్‌తో వచ్చేదే అసలైన సమాచారం.. నీట్ మెసేజ్‌లపై ఎన్‌టీఏ క్లారిటీ!
- వాట్సాప్ ద్వారా నీట్ రీ-ఎగ్జామ్ సమాచారం
- అధికారిక నంబర్ ప్రకటించిన ఎన్‌టీఏ
- ఫేక్ మెసేజ్‌లపై హెచ్చరిక
- బ్లూ టిక్ ఉన్నదే అసలు ఖాతా
- ఓటీపీలు, డబ్బులు అడగమని స్పష్టీకరణ
జూన్ 21న జరగనున్న నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పరీక్షా కేంద్రం వివరాలు, ఇతర ముఖ్యమైన అప్‌డేట్లు నేరుగా వాట్సాప్‌లో పంపనున్నట్లు తెలిపింది. ఎన్‌టీఏ పేరుతో వచ్చే ప్రతి మెసేజ్‌ను నమ్మవద్దని స్పష్టం చేసింది. అధికారిక వాట్సాప్ ఖాతాకు బ్లూ వెరిఫికేషన్ టిక్ ఉండటంతో పాటు ‘National Testing Agency’ అనే పేరు కనిపిస్తుందని తెలిపింది. వెరిఫైడ్ గుర్తు లేని ఖాతాల నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని సూచించింది.
ఎన్‌టీఏ తెలిపిన ప్రకారం తమ అధికారిక వాట్సాప్ నంబర్ +91 78279 80287 మాత్రమే. ఈ ఖాతా ద్వారా సమాచారం మాత్రమే పంపుతామని, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు, డబ్బులు ఎప్పుడూ అడగబోమని వెల్లడించింది. మరోవైపు అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు సంబంధించిన రిమైండర్ మెసేజ్‌లు, ఇ-మెయిల్స్ కూడా పంపుతున్నట్లు తెలిపింది. అధికారిక ఎస్‌ఎంఎస్‌లు NICPEP పేరుతో మాత్రమే వస్తాయని పేర్కొంది. అలాగే అధికారిక ఈ-మెయిల్ ఐడీ no-reply.neet.nta@nic.in మాత్రమేనని స్పష్టం చేసింది.
విద్యార్థులు పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే లింకులను క్లిక్ చేయకుండా వెబ్‌సైట్ అడ్రస్‌ను నేరుగా బ్రౌజర్‌లో టైప్ చేయాలని సూచించింది. మే 3న జరిగిన పరీక్షకు జారీ చేసిన అడ్మిట్ కార్డు ఇప్పుడు చెల్లదని కూడా గుర్తు చేసింది. రీ-ఎగ్జామ్‌కు కొత్త అడ్మిట్ కార్డు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.
ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీలు, లీకైన మెటీరియల్ పేరుతో ఎవరైనా సంప్రదిస్తే నమ్మవద్దని హెచ్చరించింది. అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే అధికారిక గ్రీవెన్స్ పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. రీ-ఎగ్జామ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారిక సమాచారాన్నే నమ్మాలని, సోషల్ మీడియా ప్రచారాల బారిన పడొద్దని ఎన్‌టీఏ విద్యార్థులకు తెలిపింది.