చిరంజీవి జోక్యంతో 'పర్సంటేజీ' నిర్ణయం వాయిదా.. రెంటల్ విధానంలోనే 'పెద్ది' సినిమా!
- తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొంతకాలంగా వివాదం
- పెద్ది చిత్రం నుంచి పర్సంటేజీ విధానం కోసం ఎగ్జిబిటర్ల డిమాండ్
- చిరంజీవితో భేటీ అయిన ఎగ్జిబిటర్లు
- జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ వర్తింపజేస్తామన్న ఎగ్జిబిటర్లు
దీంతో జూన్ 4వ తేదీన విడుదల కానున్న పెద్ది చిత్రంను రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 30వ తేదీ తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ విధానం వర్తింపజేస్తామని వారు తెలిపారు. తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు ముందుకు సాగాలని సూచించారు.