అమెరికాలో ఘోరం.. సూపర్ మార్కెట్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు
- వర్జీనియా సూపర్మార్కెట్లో కాల్పుల ఘటన
- మృతురాలు గుజరాత్‌కు చెందిన మేఘనాబెన్ పటేల్
- పదేళ్లుగా అదే స్టోర్‌లో పనిచేస్తున్న వైనం
- సీసీటీవీలో రికార్డయిన ఘోరం
అమెరికాలో మరో భారతీయ సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. వర్జీనియాలోని ఓ సూపర్మార్కెట్లో పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన మహిళపై దుండగుడు కాల్పులు జరిపి హతమార్చాడు. దోపిడీ యత్నంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మృతురాలి కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
మృతురాలిని మేఘనాబెన్ పటేల్ (45)గా గుర్తించారు. ఆమె గుజరాత్‌లోని మెహసానా జిల్లా, విసాపూర్ తాలూకాలోని జంత్రాల్ గ్రామానికి చెందినవారు. గత పదేళ్లుగా వర్జీనియాలోని ఈ సూపర్మార్కెట్లో ఆమె పనిచేస్తున్నారు. మేఘనాబెన్ తల్లిదండ్రులు కర్సన్భాయ్ పటేల్, కపిలాబెన్ ప్రస్తుతం జంత్రాల్ గ్రామంలోనే నివసిస్తున్నారు.
ఈ దారుణ ఘటన మొత్తం స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. జంతువుల చర్మం ప్రింట్ ఉన్న ప్యాంటు, గ్రే జాకెట్ ధరించిన ఓ వ్యక్తి ముఖానికి ముసుగుతో స్టోర్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో స్టోర్‌లో జనం ఎవరూ లేరు. అతను నేరుగా కౌంటర్ వద్దకు వచ్చి మేఘనాబెన్‌తో మాటలు కలిపాడు. కొద్దిసేపటి తర్వాత అనూహ్యంగా జేబులోంచి తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు.
కాల్పులతో ఆమె కిందపడిపోగానే, నిందితుడు అంతటితో ఆగలేదు. కౌంటర్ పైనుంచి దూకి ఆమెపైకి వంగి మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. అనంతరం నిందితుడు వచ్చిన దారిలోనే పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మేఘనాబెన్‌కు భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షీబెన్, కుమారుడు స్మిత్ ఉన్నారు. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయ సమాజంలో విషాదం నెలకొంది.