కలిసి తిరిగారు.. ఎక్కడ బెడిసికొట్టిందో: బండి భగీరథ్‌ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Rakesh Reddy Remarks on Bandi Bhagirath Case Friendship Gone Wrong
  • పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌
  • దీనితో బీజేపీకి సంబంధం లేదని రాకేశ్‌ రెడ్డి స్పష్టీకరణ.
  • రెండు కుటుంబాల మధ్య వ్యవహారమన్న ఎమ్మెల్యే
  • అమ్మాయే స్వయంగా భగీరథ్‌ను కారులో తీసుకెళ్లినట్లు వెల్లడి
  • కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు చెప్పిన బీజేపీ నేత
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ పోక్సో కేసులో అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆర్మూర్‌ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

కుటుంబాల మధ్య గొడవ
ఈ కేసు పూర్తిగా రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ అని ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేశ్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమకు వచ్చిన కొన్ని వీడియోల ప్రకారం ఆ రెండు కుటుంబాల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థమవుతుందని చెప్పారు.

చిన్నప్పటి స్నేహం
బాధిత అమ్మాయి తల్లి భగీరథ్‌కు ఎంతో ప్రేమగా గోరు ముద్దలు తినిపించిన దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే బాధిత అమ్మాయే స్వయంగా భగీరథ్‌ను కారులో తీసుకెళ్లినట్లు తెలిపారు. వారిద్దరూ చిన్నప్పటి నుంచి బావమరదళ్లలా కలిసి తిరిగారని, కలిసి పెరిగారని పేర్కొన్నారు.

తీర్థయాత్రలకు కూడా..
ఆ రెండు కుటుంబాలు కలిసి శ్రీశైలం, అరుణాచలం వంటి ప్రముఖ తీర్థయాత్రలకూ వెళ్లారని రాకేశ్‌ రెడ్డి వివరించారు. అంత బాగా ఉన్న సంబంధాలు ఎక్కడో తేడా కొట్టాయని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. రాజకీయ నాయకుల కుటుంబాలకు బండి భగీరథ్‌ అంశం ఒక గుణపాఠం లాంటిదని అభిప్రాయపడ్డారు.

పరిష్కారం అవుతుంది
చివరకు ఈ కేసును ఆ రెండు కుటుంబాలు కలిసి కూర్చొని పరిష్కరించుకుంటాయని తాను భావిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Bandi Bhagirath
Bandi Sanjay
Paidi Rakesh Reddy
BJP
Armoor MLA
POCSO case
family dispute
Srisailam
Arunachalam
Telangana politics

More Telugu News