యూపీలో 'జిమ్ జిహాద్'.. మతమార్పిడికి పాల్పడుతున్న వారిపై గ్యాంగ్‌స్టర్ చట్టం

Yogi Adityanath Government Acts on UP Gym Conversion Racket
  • హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిళ్లకు పాల్పడుతున్న ముఠా
  • మీర్జాపూర్‌లో జిమ్‌లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ముఠా
  • మహిళలతో పరిచయాలు పెంచుకుని మతం మారాలని ఒత్తిడి
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిడికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు రట్టు చేశారు. బలవంతపు మతమార్పిడికి పాల్పడుతున్న పదిమందిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పదిమందిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇటీవల నాసిక్‌లోని టీసీఎస్ కంపెనీలో బలవంతపు మతమార్పిళ్లు, లైంగిక వేధింపులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో అలాంటి సంఘటన వెలుగు చూసింది. జిమ్‌లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిడి చేస్తున్న నెట్ వర్క్‌ను పోలీసులు గుర్తించారు. మీర్జాపూర్‌లో ఒక జిమ్ యజమాని మతం మారాలని తనను బలవంతం చేస్తున్నాడని ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై విచారణ చేస్తుండగా దీని వెనుక పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లు గుర్తించారు.

నిందితులు రాష్ట్రంలోని వివిధ జిమ్‌లు, సోషల్ మీడియాల్లో ముందుగా మహిళలతో పరిచయాలు పెంచుకుంటారు. ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 50 మందికి పైగా మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సన్నో అనే మహిళ ప్రధాన పాత్రను పోషించినట్లు వెల్లడించారు.

ముందుగా జిమ్‌లలో చేరి అక్కడి యువతులతో సన్నో పరిచయం పెంటుకుంటుందని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ముస్లిం యువకులను తన స్నేహితులుగా వారికి పరిచయం చేస్తున్నట్లు గుర్తించారు. మరికొందరు మహిళలను నిందితులు సోషల్ మీడియా పేజీలో ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల ద్వారా పరిచయం పెంచుకుంటున్నట్లు తెలిపారు. వారిలో మతమార్పిడి ఆలోచనలు కలిగేలా బ్రెయిన్ వాష్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఫోన్‌లలో వందలాది మంది మహిళల ఫొటోలు, వీడియోలు, చాట్‌లు ఉన్నట్లు గుర్తించారు. వాటిపై దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కేసు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్ళడంతో ఆయన తీవ్రంగా స్పందించారు.
Go Back to Shorts
Yogi Adityanath
Uttar Pradesh
Mirzapur
Forced Conversion
Religious Conversion
Gym Jihad
Love Jihad

More Telugu News