ముంబైలో అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు
- ముంబైలోని అనిల్‌కు సంబంధించిన 17 ప్రాంగణాల్లో సోదాలు
- కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, మధ్యవర్తిత్వం వహించిన సంస్థల కార్యాలయాల్లో సోదాలు
- ఒకే చిరునామా నుంచి పలు మధ్యవర్తి కంపెనీలు పనిచేసినట్లు గుర్తించిన సీబీఐ
రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అనిల్ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలైన రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ పైనాన్స్ లిమిటెడ్‌లపై నమోదైన కేసులకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంకు మోసం కేసులో ముంబైలో అనిల్ అంబానీకి సంబంధించిన 17 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది.
కంపెనీల డైరెక్టర్ల నివాసాలు, మధ్యవర్తిత్వం వహించిన సంస్థల కార్యాలయాల్లో కూడా సోదాలు జరుపుతున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఒకే చిరునామా నుంచి పలు మధ్యవర్తి కంపెనీలు పనిచేస్తున్నట్లు గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్ఐసీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌పై ఏడు కేసులు నమోదయ్యాయి.