ఎమ్మెల్యేల మద్దతు లేకుండా గవర్నర్ వద్దకు ఎందుకు వెళ్లారు?: విజయ్‌పై డీఎంకే విమర్శనాస్త్రాలు
- గవర్నర్ వద్దకు అతిపెద్ద పార్టీగా వెళ్లవలసి ఉండేనన్న డీఎంకే
- కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి గవర్నర్‌ను కలవడంపై ప్రశ్న
- ఇతర పార్టీలతో కలిసి వెళ్తే మెజారిటీయే అడుగుతారన్న డీఎంకే
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ టీవీకే అధినేత విజయ్ వరుసగా గవర్నర్‌ను కలుస్తుండటంపై డీఎంకే విమర్శనాత్మకంగా స్పందించింది. తగినంత మద్దతు లేకుండా గవర్నర్‌ను కలవడం అర్థరహితమని పేర్కొంది. గవర్నర్ ను సంప్రదించడానికి ముందే ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవాలని సూచించింది. ఎమ్మెల్యేల మద్దతు లేకుండా గవర్నర్‌కు లేఖ ఇవ్వడం ఎందుకని ప్రశ్నించింది. తమిళనాడులో కొనసాగుతున్న ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్ఠంభనపై డీఎంకే సీనియర్ నాయకుడు ఇలంగోవన్ స్పందించారు.
గవర్నర్‌ను సంప్రదించడానికి ముందే విజయ్ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టుకోవాలని సూచించారు. విజయ్ మొదటిసారి గవర్నర్‌ను కలిసినప్పుడు కేవలం తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వద్దకు వెళితే బాగుండేదని అన్నారు. అప్పుడు ఏకైక అతిపెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించి ఉండేవారని అన్నారు. కానీ వారు తమతో పాటు రెండో పార్టీని (కాంగ్రెస్) తీసుకువెళ్లి తమ బలం 112గా గవర్నర్ ముందు చూపించారని గుర్తు చేశారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ వద్దకు వెళ్లినప్పుడు, ఆయన కచ్చితంగా సంపూర్ణ మెజారిటీ అడుగుతారని అన్నారు.
ఏఎంఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే తమకు మద్దతు ఇచ్చినట్లు టీవీకే పేర్కొందని, కానీ ఆ పార్టీ మాత్రం తమ పార్టీ లేఖను ఫోర్జరీ చేశారని ఆరోపించారని గుర్తు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దతివ్వనప్పుడు టీవీకే పార్టీ లేఖ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. తమపై వచ్చిన ఆరోపణలను టీవీకే నిరూపించుకోవాలని సూచించారు.