మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గంలో సువేందు ఓడించారు: అమిత్ షా

Amit Shah Claims Suvendu Adhikari Defeated Mamata in Bengal Election
  • టీఎంసీ ఓటమితో రాష్ట్రంలో అరాచక పాలన ముగిసిపోయిందన్న కేంద్రమంత్రి
  • బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని వ్యాఖ్య
  • అభివృద్ధితో పాటు హామీలు నెరవేర్చే బాధ్యత బీజేపీపై ఉందని వ్యాఖ్య
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తమ పార్టీ నాయకుడు సువేందు అధికారి ఆమె సొంత నియోజకవర్గంలో ఓడించారని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, బెంగాల్ ఐదు దశాబ్దాల పాటు ప్రజాస్వామ్య క్షీణత, శాంతిభద్రతల పతనంతో తీవ్ర సమస్యను ఎదుర్కొందని అన్నారు. ఇప్పుడు టీఎంసీ ఓటమితో రాష్ట్రంలో అరాచక పాలన ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు.

బీజేపీ బెంగాల్‌లో అద్భుత విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఈ విజయం అసాధారణమని, బెంగాల్ చరిత్రలోనే కీలక మలుపు అన్నారు. ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ఇప్పుడు బీజేపీ పైనే ఉందని స్పష్టం చేశారు. బెంగాల్ అభివృద్ధి బాధ్యత తమపైనే ఉందని అన్నారు.

రాష్ట్రంలో పోలింగ్‌ను శాంతియుతంగా నిర్వహించారంటూ ఎన్నికల సంఘం, భద్రతా దళాలు, రాష్ట్ర అధికారులను అమిత్ షా అభినందించారు. కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతోందని అన్నారు. ఎందుకు ఓడిపోతున్నామో ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఆత్మపరిశీలన చేసుకోని నాయకులు ఎప్పటికీ నిజమైన విజయాన్ని అందుకోలేరని అమిత్ షా అన్నారు.
Go Back to Shorts
Amit Shah
Mamata Banerjee
Suvendu Adhikari
TMC
BJP
West Bengal Elections
Bengal Politics

More Telugu News