మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ
- ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంతెన
- ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా ఇటీవల నియామకం
- మంతెన సేవలను ప్రశంసించిన మంత్రి లోకేశ్
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు, ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు సోమవారం నాడు మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని తెలుస్తోంది.
ఇటీవల మంతెన సత్యనారాయణ రాజును రాష్ట్ర ప్రభుత్వం యోగా, నేచురోపతి విభాగం గౌరవ సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రి లోకేశ్‌ను కలిశారు.
ఈ సందర్భంగా ప్రకృతి వైద్య రంగంలో దశాబ్దాలుగా మంతెన అందిస్తున్న సేవలను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజారోగ్యం కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.