జీటీ చీర్‌లీడర్‌పై చెన్నై అభిమాని కామెంట్.. దిమ్మతిరిగే కౌంటర్‌తో నోరు మూయించిన యువతి!

IPL Cheerleader Shuts Down Rude Fan With Epic Comeback
  • ఐపీఎల్ మ్యాచ్‌లో చీర్‌లీడర్‌పై అభిమాని అనుచిత వ్యాఖ్య
  • ‘మేకప్ లేకుంటే బాగుంటావు’ అన్న ఫ్యాన్‌కు దిమ్మతిరిగే జవాబు
  • చీర్‌లీడర్‌కు మద్దతుగా నిలుస్తూ నెటిజన్ల ప్రశంసలు
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఓ చీర్‌లీడర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆమె ఏమాత్రం తగ్గకుండా దిమ్మతిరిగే రీతిలో సమాధానమిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ చీర్‌లీడర్ ఆత్మవిశ్వాసానికి, సమయస్ఫూర్తికి ఫిదా అవుతున్నారు.

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించిన ఓ అభిమాని గుజరాత్ టైటాన్స్ చీర్‌లీడర్‌ దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఫెన్సింగ్ అవతల నుంచి ఆమెతో "నువ్వు దేవదూతలా ఉన్నావు. అంత పెద్ద మేకప్ లేకుండా ఉంటే ఇంకా అందంగా కనిపిస్తావు" అని అనవసర వ్యాఖ్య చేశాడు.

అతడి మాటలకు మొదట ఆశ్చర్యపోయిన ఆ చీర్‌లీడర్ వెంటనే తేరుకుని నవ్వుతూ గట్టిగా బదులిచ్చింది. "ముందు నువ్వు పళ్లు తోముకుని రా... నీకు ఏమైనా మేకప్ అవసరమైతే చెప్పు?" అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఊహించని ఈ సమాధానంతో అభిమాని ముఖం మాడిపోయింది. ఈ సంభాషణను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు చీర్‌లీడర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అభిమాని తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛ, రూపంపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదని హితవు పలుకుతున్నారు. ఆ చీర్‌లీడర్ అతడికి సరైన బుద్ధి చెప్పిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన వల్లే చీర్‌లీడర్లను ప్రేక్షకులకు దూరంగా ఉంచుతారని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన స్టేడియాలలో అభిమానుల ప్రవర్తన ఎలా ఉండాలో మరోసారి చర్చకు దారితీసింది.
Go Back to Shorts
IPL Cheerleader
Cheerleader
Gujarat Titans
Chennai Super Kings
IPL
Indian Premier League
Cricket
Fan behavior
Social Media Viral
Cheerleader Counter

More Telugu News