నా కుటుంబం ఫొటో తీయవద్దు: అభిమానికి హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ హెచ్చరిక

Furious Heinrich Klaasen loses cool as fan films his family
  • ముంబై ఇండియన్స్‌పై విజయం అనంతరం హైదరాబాద్ బయలుదేరిన సన్‌రైజర్స్
  • "మీరు చాలా బాగా ఆడారు" అంటూ అభిమాని ప్రశంస
  • ఫొటో తీయడానికి ప్రయత్నించడంతో వద్దని వార్నింగ్
తనతో పాటు తన కుటుంబాన్ని ఫొటో తీయడానికి ప్రయత్నించిన ఒక అభిమానిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. గత సంవత్సరం జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ జట్టు తరఫున అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ తదుపరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనుంది.

ముంబై ఇండియన్స్‌పై విజయం అనంతరం, సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ సమయంలో క్లాసెన్‌తో ఒక అభిమాని మాట్లాడుతూ, "మీరు చాలా బాగా ఆడారు" అని ప్రశంసించాడు. క్లాసెన్ స్పందిస్తూ, "థాంక్యూ వెరీమచ్ సర్" అన్నాడు.

అంతలో ఆ అభిమాని ఫొటోలు తీయడానికి ప్రయత్నించాడు. "దయచేసి ఫొటోలు, వీడియోలు తీయకండి. నేను అటు తిరిగితే నా ఫ్యామిలీ ఫొటోలు తీస్తారు. కానీ అలా చేయకండి. మీరు ఆపకపోతే బాగుండదు. మిమ్మల్ని మట్టికరిపిస్తాను" అని హెచ్చరించాడు. క్లాసెన్ హెచ్చరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కానీ ఇందులో అతని ముఖం మాత్రం కనిపించలేదు. సామాజిక మాధ్యమాల్లో క్లాసెన్‌కు మద్దతు లభించింది.
Go Back to Shorts
Furious Heinrich Klaasen loses cool as fan films his family
Heinrich Klaasen loses cool

More Telugu News