నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన
- రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు
- ఈ ప్రాజెక్టుల ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు
- రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్టుల నిర్మాణం
ఈ పెట్టుబడిలో భాగంగా రెండు కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. రూ.4,200 కోట్ల వ్యయంతో 6.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్‌ను, రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం రానున్న రెండేళ్లలో పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాకతో అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 9.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరారు. ఉదయం 11.10 గంటలకు జెడ్. చింతువకు చేరుకుని, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.