స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట సంబరాలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య ప్రియ
- రెండోసారి తండ్రైన ప్రముఖ దర్శకుడు అట్లీ
- ఇవాళ తమకు ఆడపిల్ల పుట్టినట్టు ప్రకటించిన అట్లీ, ప్రియ దంపతులు
- ఇప్పటికే ఈ జంటకు మీర్ అనే కుమారుడు
- అల్లు అర్జున్‌తో 'రాక' అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్న అట్లీ
స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట సంతోషం వెల్లివిరిసింది. ఇవాళ తనకు రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టినట్టు ప్రకటించారు. అట్లీ, ఆయన భార్య ప్రియ దంపతులకు ఇప్పటికే మీర్ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు పాప పుట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ శుభవార్తను అట్లీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "ఆశీర్వదించబడ్డాను" అనే క్యాప్షన్‌తో ఓ అందమైన పోస్టర్‌ను షేర్ చేశారు. అందులో వారి కుమారుడు మీర్ బొమ్మతో పాటు "యే! నాకు చెల్లి పాప పుట్టింది" అని రాసి ఉంది. 2026 ఏప్రిల్ 20న తమకు అమ్మాయి పుట్టిందని ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు.
ఇక అట్లీ కెరీర్ విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో 'రాక' అనే భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. గుండుతో, రగ్డ్ లుక్‌లో ఉన్న అల్లు అర్జున్ ముఖానికి తోడేలు పంజా అడ్డుగా ఉన్నట్టు చూపించి ఆసక్తిని రేకెత్తించారు.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచస్థాయి సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ‘ఐరన్ మ్యాన్ 2’ ఫేమ్ జేమ్స్ మ్యాడిగన్, ఆస్కార్ అవార్డు గ్రహీత జస్టిన్ రాలీ వంటి అంతర్జాతీయ నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఈ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, తాము చదివిన వాటిలో అత్యుత్తమమని పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు ప్రశంసించారు. ఈ సినిమాకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.