తెలంగాణలో మండుతున్న ఎండలు.. కొమురంభీమ్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత
- ఉదయం నుంచే బయటకు రాలేని పరిస్థితులు
- నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచన
తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలకు పైగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే రోజున అత్యధిక ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలు కాగా, ఈ సంవత్సరం నేడు 44.6 డిగ్రీలుగా నమోదైంది. రోజురోజుకు ఎండలు పెరుగుతున్నందున చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరింది.