ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్కు బాంబు బెదిరింపు
- మెట్రో స్టేషన్లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
- పోలీసులకు సమాచారం అందించిన మెట్రో సిబ్బంది
- తనిఖీలు నిర్వహించగా లభ్యం కాని అనుమానాస్పద వస్తువులు
తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మెట్రో రైలు స్టేషన్లో ఎలాంటి బాంబు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. ఫోన్ చేసిన నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తి ఎవరో ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.