అన్నెసీ ఫెస్టివల్ కు 'బాహుబలి'... యానిమేషన్ అనేది హద్దులు లేని కాన్వాస్ అన్న రాజమౌళి
- ప్రతిష్ఠాత్మక అన్నెసీ 2026 ఫెస్టివల్ కు బాహుబలి యానిమేషన్ చిత్రం ఎంపిక
- 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలో ప్రదర్శించనున్న 'బాహుబలి: ది ఎటర్నల్ వార్'
- ఇది భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవమన్న దర్శకధీరుడు
యానిమేషన్‌కు ఎలాంటి హద్దులు ఉండవని తాను ఎప్పుడూ నమ్ముతానని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అన్నారు. ప్రతిష్ఠాత్మక అన్నెసీ 2026 ఫెస్టివల్‌కు ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ యానిమేషన్ చిత్రం ఎంపికవడం భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
రాజమౌళి సమర్పణలో, ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న యానిమేషన్ చిత్రం 'బాహుబలి: ది ఎటర్నల్ వార్'. ఈ చిత్రం 'అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026'కు ఎంపికైంది. యానిమేషన్ రంగంలో ఆస్కార్‌గా భావించే ఈ వేడుకలో 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలో దీన్ని ప్రదర్శించనున్నారు. భారతీయ మెయిన్‌స్ట్రీమ్ సినిమాకు చెందిన యానిమేషన్ ప్రాజెక్ట్ ఈ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం ఇదే తొలిసారి.
రాజమౌళి తన ట్వీట్‌లో ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు ఇషాన్ శుక్లాతో పాటు మొత్తం బృందాన్ని అభినందించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక యానిమేషన్ వేదికపై తమ విజన్‌ను ప్రదర్శించేందుకు టీమ్ మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉందని తెలిపారు.
'బాహుబలి: ది ఎటర్నల్ వార్'లో మహిష్మతి సామ్రాజ్యం, అమరేంద్ర బాహుబలి, భల్లాలదేవుడి కథలను యానిమేషన్ రూపంలో మరింత అద్భుతంగా చూపించనున్నారు. ఈ ఎంపిక భారత యానిమేషన్ రంగానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, ప్రపంచ యానిమేషన్ పటంలో భారతీయ కథలకు ఇది ప్రత్యేక స్థానం కల్పిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.