ఓ ఉద్యోగి నిర్వాకంతో బూడిదైన కింబర్లీ-క్లార్క్ గోదాం.. వీడియో ఇదిగో!
- కంపెనీలోని టాయిలెట్ పేపర్ల బండిల్ కు నిప్పు పెట్టిన ఉద్యోగి
- మంటలు విస్తరించి కాలి బూడిదైన భారీ గోడౌన్.. అమెరికాలో ఘటన
- ఏకంగా 175 ఫైరింజన్లతో మంటలు ఆర్పిన సిబ్బంది
గోదాంలో పేపర్ ఉత్పత్తులు ఉండటంతో మంటలు క్షణాల్లో భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దీనిని '6-అలారం ఫైర్'గా ప్రకటించి, ఏకంగా 175 ఫైరింజన్లు, వందలాది మంది సిబ్బందితో మంటలను అదుపు చేసేందుకు గంటల తరబడి శ్రమించారు. అయినప్పటికీ 1.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలోని గోదాం పైకప్పు కూలిపోయి, లోపలున్న సరుకంతా బూడిదైంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న 20 మంది ఉద్యోగులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనకు కారణమైన చామెల్ అబ్దుల్ కరీంను పోలీసులు అరెస్ట్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అమెరికా వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో టాయిలెట్ పేపర్, టిష్యూల సరఫరాపై ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.