ప్రియుడితో వెళ్లిపోయిందని.. భార్య గొంతుకోసి చంపేసిన భర్త
- జహీరాబాద్‌లో మార్చి 30న అదృశ్యం కేసు
- ప్రియుడితో కలిసి జడ్చర్లలో ఉన్నట్లు గుర్తింపు
- కారులో తీసుకువస్తుండగా ఘర్షణ
తన ప్రియుడితో కలిసి ఆమె జడ్చర్లలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జహీరాబాద్‌కు తీసుకువచ్చేందుకు పోలీసులు, భర్త కలిసి వెళ్లారు. ఆమెను తీసుకుని కారులో జడ్చర్ల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. జడ్చర్ల నుంచి వస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కారు సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకున్న సమయంలో భర్త భార్య గొంతు కోసి చంపేశాడు.