Realme 16 5G: రియల్ మీ 16 5జీ... అదిరిపోయే ఫీచర్లతో లాంచింగ్

Realme 16 5G launching with new features
షార్ట్స్‌లో చూడండి
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీని మరింత పెంచేందుకు ప్రముఖ బ్రాండ్ రియల్‌మీ సిద్ధమైంది. తన విజయవంతమైన నంబర్ సిరీస్‌ను కొనసాగిస్తూ, 'రియల్‌మీ 16 5G' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 2న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మిడ్-రేంజ్ విభాగంలో ప్రీమియం డిజైన్, అత్యాధునిక కెమెరా ఫీచర్లను కోరుకునే వినియోగదారులే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీలో సరికొత్త అనుభూతిని అందించడమే ఈ ఫోన్ ప్రధాన ఉద్దేశం.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీపై దృష్టి సారించింది. ముందు, వెనుక వైపు ఒకే విధమైన నాణ్యతతో ఫొటోలు తీయాలనే లక్ష్యంతో, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు, వెనుక వైపు సోనీ IMX 852 సెన్సార్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ (f/1.8) కెమెరాను అమర్చారు. దీనివల్ల సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు అయినా అద్భుతమైన స్పష్టతతో వస్తాయి. 

ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా 'రియర్ సెల్ఫీ మిర్రర్' అనే వినూత్న ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు. దీని సాయంతో యూజర్లు నాణ్యమైన వెనుక కెమెరాను ఉపయోగించి సులభంగా సెల్ఫీలు తీసుకోవచ్చు. అంతేకాకుండా, 'సే హాయ్' అనే సంజ్ఞతో చేతులు ఉపయోగించకుండా ఫొటోలు తీసే సౌలభ్యం, ఇంటిగ్రేటెడ్ రింగ్ ఫ్లాష్ వంటివి విభిన్న లైటింగ్ పరిస్థితుల్లోనూ స్టూడియో నాణ్యతతో కూడిన చిత్రాలను అందించడంలో సహాయపడతాయి.

కేవలం హార్డ్‌వేర్‌కే పరిమితం కాకుండా, ఇమేజింగ్ టెక్నాలజీలోనూ రియల్‌మీ ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన 'లుమాకలర్ ఇమేజ్ టెక్నాలజీ' సహజమైన స్కిన్ టోన్లు, సమతుల్యమైన లైటింగ్ అందిస్తూ చిత్రాలకు వాస్తవికతను జోడిస్తుంది. కంటెంట్ క్రియేటర్లను ఆకట్టుకునేలా 'వైబ్ మాస్టర్ మోడ్' కూడా ఇచ్చారు. దీనిలోని 'లైవ్లీ', 'ఫెస్టివల్', 'సెర్మనీ' వంటి ప్రీసెట్‌లతో యూజర్లు తమ ఫొటోల మూడ్, విజువల్ స్టైల్‌ను సులభంగా మార్చుకోవచ్చు. 

దీనికి అదనంగా, ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 'ఏఐ ఎడిట్ జీనీ' ఫీచర్‌తో హెయిర్‌స్టైల్స్, దుస్తులు, బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకునే సౌలభ్యం ఉండగా, 'ఏఐ ఇన్‌స్టంట్ క్లిప్' ఫీచర్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి అనువుగా చిన్న క్లిప్స్‌గా మారుస్తుంది.

కెమెరా ఫీచర్లతో పాటు డిజైన్, బ్యాటరీ విషయంలోనూ ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. చాలా సన్నగా, ఆకర్షణీయంగా ఉండే 'ఎయిర్-ఇన్‌స్పైర్డ్' డిజైన్‌తో పాటు, భారీ 7000mAh బ్యాటరీని అమర్చడం విశేషం. సాధారణంగా సన్నని ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఫోన్ ప్రీమియం లుక్‌తో పాటు రోజంతా ఛార్జింగ్ అవసరం లేకుండా నిరంతరాయంగా పనిచేసేలా రూపొందించబడింది. మొత్తంమీద, అత్యాధునిక కెమెరా వ్యవస్థ, ప్రీమియం డిజైన్, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మీ 16 5G మిడ్-రేంజ్ విభాగంలో వినియోగదారులకు ఒక సమగ్రమైన ప్యాకేజీగా అందుబాటులోకి రానుంది.
Go Back to Shorts
Realme 16 5G
Realme
Realme 16 5G launch
50MP camera
smartphone
portrait photography
AI Edit Genie
7000mAh battery
Luma Color Image Technology
rear selfie mirror

More Telugu News