KTR: కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్.. ఒకే టేబుల్‌పై భోజనం, రెండు గంటలకు పైగా సమాలోచనలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ముగ్గురు సరదాగా మాట్లాడుకున్నారు. మంగళవారం అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఒకే టేబుల్‌పై భోజనం చేశారు. ఆ తర్వాత అక్కడే చాలాసేపు వారు మాట్లాడుకున్నారు. రెండు గంటలకు పైగా వారి మధ్య సంభాషణలు జరగడం గమనార్హం. మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.