Asim Munir: పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్‌తో ఆర్మీ చీఫ్ మునీర్ చర్చలు!
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పే ప్రయత్నాల్లో పాకిస్థాన్ కీలక మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. దీనిపై యూకేకు చెందిన ప్రముఖ పత్రిక 'ఫైనాన్షియల్ టైమ్స్' ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇస్లామాబాద్ తెరవెనుక చురుకైన దౌత్య ప్రయత్నాలు చేస్తోందని ఆ కథనం వెల్లడించింది.
ఈ దౌత్యంలో భాగంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌లతో ముడిపడి ఉన్న ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకే ఈ భేటీ జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఈ వారంలోనే ట్రంప్ యంత్రాంగంలోని సీనియర్ అధికారులు, ఇరాన్ ప్రతినిధుల మధ్య పాకిస్థాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వివరించింది. మరోవైపు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది.
వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు టర్కీ, ఈజిప్టులతో కలిసి పాకిస్థాన్ చురుకైన "తెరవెనుక దౌత్యం" నడుపుతోందని ఈ నివేదిక తెలిపింది. అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి వంటి కీలక నేతల మధ్య పరోక్ష సంప్రదింపులకు పాక్ ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని వివరించింది. జారెడ్ కుష్నర్ వంటి వారితోనూ టెహ్రాన్ మాట్లాడేందుకు పాక్ వీలు కల్పిస్తోందని పేర్కొంది.
అయితే, ఈ నివేదికపై ఇరాన్ స్పందిస్తూ.. సంక్షోభం మొదలైనప్పటి నుంచి అమెరికాతో తాము ఎలాంటి ప్రత్యక్ష చర్చలూ జరపలేదని స్పష్టం చేసింది. కానీ, మధ్యవర్తి దేశాల ద్వారా తమకు సందేశాలు అందాయని, వాటికి తమ విధానాలకు అనుగుణంగా స్పందించామని అంగీకరించింది. ఈ పరిణామాలపై వైట్‌హౌస్ స్పందిస్తూ.. ఇవి సున్నితమైన దౌత్యపరమైన చర్చలని, వీటిపై వివరాలు వెల్లడించలేమని తెలిపింది. "మీడియా ద్వారా అమెరికా సంప్రదింపులు జరపదు" అని స్పష్టం చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
ఈ వివాదంలో పాకిస్థాన్ ప్రత్యక్షంగా పాలుపంచుకోకపోవడం, తమ భూభాగంలో అమెరికా సైనిక స్థావరాలు లేకపోవడం వంటి కారణాలతో తటస్థంగా వ్యవహరిస్తోంది. మధ్యవర్తిగా పాకిస్థాన్ విశ్వసనీయతను ఇదే పెంచిందని ఆ కథనం విశ్లేషించింది.