Ponnam Prabhakar: తెలంగాణ వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు 'వాహన్' సేవలు ప్రారంభం
వాహనదారులకు రవాణా శాఖ తీపి కబురు అందించింది. ఇకపై ఆర్‌టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మెజారిటీ సేవలను ఇంటి వద్ద నుంచే పొందేలా ఆన్‌లైన్ వ్యవస్థను పటిష్టం చేస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖకు చెందిన ‘వాహన్’ (Vahan) సేవలను రాష్ట్రంలో సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభించనున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొత్త పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
మొదటి విడతలో భాగంగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. త్వరలోనే పాత వాహనాలకు సంబంధించిన సేవలను కూడా ‘పరివాహన్’ పోర్టల్ ద్వారా అందించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే.. వాహన యజమాని పేరు మార్పు (Transfer of Ownership), అడ్రస్ మార్పు, డూప్లికేట్ ఆర్‌సీ పొందడం వంటి పనులన్నీ సులువుగా మారిపోతాయి. అంతేకాకుండా, రవాణా వాహనాల పన్నులు, ఇతర రుసుములను నేరుగా ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు.
మరో కీలకమైన మార్పు ఏమిటంటే, వాహనదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు రిజిస్ట్రేషన్ మార్చుకోవడానికి ఇకపై నిరభ్యంతర పత్రం (NOC) అవసరం ఉండదు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా పారదర్శకంగా సేవలు అందనున్నాయి. ఇప్పటికే లెర్నర్, డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం ‘సారథి’ సేవలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘వాహన్’ సేవలు తోడవ్వడంతో రవాణా శాఖలో మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సేవలను ప్రారంభించిన అనంతరం, సర్వర్లపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు సాంకేతిక బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కోటిన్నరకు పైగా వాహనాల డేటా పరివాహన్ పోర్టల్‌లోకి బదిలీ అయినట్లు సమాచారం.