Raja Singh: కేంద్రమంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ

Raja Singh writes to Amit Shah about death threats
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించి తాను పలుమార్లు లేఖ రాశానని ఆయన పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని ఆయన లేఖలో అమిత్ షాను కోరారు.

కాగా, రాజాసింగ్‌కు పలుమార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రాణహాని తలపెట్టేలా మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 27న శ్రీరామ నవమి శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 27వ తేదీలోగా రాజాసింగ్‌ను చంపేస్తామంటూ ఆగంతుకులు ఆ లేఖలో హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అమిత్ షాకు లేఖ రాశారు.
Go Back to Shorts
Raja Singh
Amit Shah
Raja Singh threat
Goshamahal MLA
Raja Singh security
Shri Rama Navami

More Telugu News