Putta Mahesh: నేను తప్పు చేయలేదు: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్

Putta Mahesh I did not do anything wrong says Eluru MP
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఈ ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో తన పేరు ప్రస్తావనకు రావడం దురదృష్టకరమని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆ రోజు డిన్నర్‌కు హాజరైన మాట వాస్తవమే అయినప్పటికీ, తాను ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ప్రజలకు, పార్టీ అధిష్టానానికి వాస్తవాలు తెలియజేస్తున్నానని వివరించారు.

ఈ కేసు విచారణకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు. అదే సమయంలో, పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు. పార్టీ నుంచి అందిన నోటీసుకు లిఖితపూర్వకంగా వివరణ సమర్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణల నుంచి బయటపడి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పటిలాగే కట్టుబడి పనిచేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.

.
Go Back to Shorts
Putta Mahesh
Eluru MP
Drugs Case
Hyderabad Drugs
YSRCP
Andhra Pradesh Politics
Eluru Parliament
Drug Allegations
Political News
AP News

More Telugu News